Monkeypox: దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. వ్యాధి మెల్లగా మనదేశం నుంచి వెళ్లిపోతోంది. ఈ నేపథ్యంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. కానీ కొత్త వైరస్ ఆందోళన కలిగిస్తోంది. మంకీపాక్స్ మన దేశంలో కూడా అడుగు పెట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కూడా వేగంగా విస్తరించే వైరస్ కావడంతోనే అందరిలో భయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో మనదేశం కూడా మంకీపాక్స్ మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశిస్తోంది. ఈ మేరకు వైరస్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

కేరళకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల యూఏఈ వెళ్లొచ్చాడు. అక్కడ మంకీపాక్స్ రోగితో కలిసి తిరిగినట్లు తెలిసింది. దీంతో అతడు స్వదేశానికి రాగానే అనారోగ్యం బారిన పడ్డాడు. అతడికి పరీక్షలు నిర్వహించగా మంకీపాక్స్ అని తేలింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అతడి కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించింది. క్వారంటైన్ లో ఉండాల్సిందిగా సూచించింది. ఎవరిని కలవకూడదని చెప్పింది. దీంతో కరోనా ఎంత వేగంగా విస్తరిస్తుందో అంతే వేగంగా మంకీపాక్స్ కూడా విస్తరించే అవకాశాలు ఉండటంతోనే అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.
Also Read: Babar Azam- Virat Kohli: విరాట్ కోహ్లీకి పై షాకింగ్ కామెంట్స్ చేసిన పాకిస్తాన్ కెప్టెన్
విదేశాల్లో ఉన్నప్పుడు చర్మ సంబంధ, జననేంద్రియ వ్యాధులతో బాధపడే వారికి దూరంగా ఉండటమే మంచిది. చనిపోయిన కోతులు, చింపాంజీలు, ఎలుకలను తాకకూడదు. ఆఫ్రికా ఖండంలో జంతు సంబంధమైన ఆహార పదార్థాలను ముట్టుకోకూడదు. రోగులు వాడిన దుస్తులు, ఇతర వస్తువులకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. రోగ లక్షణాలు ఉన్న వారితో కూడా తిరగడం శ్రేయస్కరం కాదు. అందుకే మంకీపాక్స్ పై కేంద్రం పలు కోణాల్లో సూచనలు చేస్తోంది. దాని బారి నుంచి రక్షించుకునేందుకు జాగ్రత్తలు పాటించాల్సిందేనని సూచిస్తోంది.

ఇంతవరకు యాభై దేశాల్లో మంకీపాక్స్ తన పంజా విసిరింది. కానీ ఇంతవరకు ఒకే మరణం సంభవించినా అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది. వేగంగా విస్తరించే వైరస్ కావడంతో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటోంది. ఈ మేరకు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి మంకీపాక్స్ విషయంలో ప్రజలు ముందుచూపుతో వ్యవహరంచాలని ఆదేశించారు. వీలైనంత వరకు మంకీపాక్స్ వైరస్ బారిన పడకుండా ఉండాలని చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ప్రజలు తగినంత జాగరూకతతో ఉండాలని స్పష్టం చేస్తున్నారు.
Also Read:The warrior Collections: ‘ది వారియర్’ 2 డేస్ కలెక్షన్స్.. ఏ ఏరియాలో ఎన్ని కోట్లు వచ్చాయి ?
[…] Also Read: Monkeypox: బీ అలెర్ట్.. కరోనా పోయింది.. దేశంపై… […]
[…] Also Read: Monkeypox: బీ అలెర్ట్.. కరోనా పోయింది.. దేశంపై… […]