
Mohan Babu: ప్రస్తుతం మా ఎన్నికలకు సంబంధించి కొత్త రికార్డు నమోదైంది అంటూ రచ్చ చేస్తున్నారు. ఇప్పటివరకు మా చరిత్రలోనే ఈ స్థాయి పోలింగ్ జరగలేదు అంటూ బాగా హడావిడి చేస్తున్నారు. ఓకే.. ఎవరి హడావుడి ఎలా ఉన్నా.. ఏ రికార్డు ఎలా ఉన్నా.. అసలు డైరెక్ట్ గా నమోదు అయిన 605 వరకు ఓట్లుకు కారణం ఎవరు ? మొత్తం 883 ఓట్లకు ఇన్ని ఓట్లు డైరెక్ట్ గా పడటం అంటే.. దీని వెనుక బలమైన రిలేషన్స్ ఉన్నాయి.
పైగా పోస్టల్ బ్యాలెట్స్ అదనం. కాబట్టి.. మొత్తం 665 ఓట్లు. ఒక విధంగా ఈ ఓట్లు ఎవరిని గెలిపించబోతున్నాయో ? ఎవరిని ఓడించబోతున్నాయో అంతుబట్టడం లేదు. మరో మూడు గంటల్లో ఫలితాలు ఎలాగూ రాబోతున్నాయి కాబట్టి.. అప్పటివరకు వేచి ఉండక తప్పదు. కానీ ఎన్నో ఆరోపణలు, అనేక గొడవల నేపథ్యంలో కొందరు నటులు ఒకరిపై ఒకరు చేయి చేసుకునే వరకు వెళ్లడం విశేషం.
అయితే ఈ మొత్తం నేపథ్యంలో సమీర్ అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసిన ఓవర్ యాక్షన్ పై మోహన్ బాబు సీరియస్ గా ఉన్నారు. ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా తనకు సమానమే అని మోహన్ బాబు ఎన్నికల అధికారితో చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్నికల మధ్యలో సమీర్ లాంటి వెధవలు చేసిన బిల్డప్ కి సరైన సమాధానం చెబుతాను అంటూ మోహన్ బాబు స్పష్టం చేశారట.
ఇంతకీ సమీర్ ఏమి చేశాడు అంటే.. ఓటింగ్ జరుగుతున్న సమయంలో సమీర్ బయట వ్యక్తుల్ని పోలింగ్ కేంద్రంలోకి పంపిస్తున్నారు. ఇది గమనించి శివబాలాజీ ఎందుకు బయట వ్యక్తులను రానిస్తున్నారని అడిగాడు. సమీర్ పలకలేదు. దాంతో శివబాలాజీ, సమీర్ ను ఇంకా కాస్త గట్టిగానే ప్రశ్నించాడు. అయితే, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా…
ఒక్కసారిగా కోపంతో ఊగిపోతూ సమీర్.. శివబాలాజీ మీదకు ఉరికాడు. పైగా ‘ఎన్నికలు అయిపోయాక, బయటకు రా నీ సంగతి చూస్తా’ వార్నింగ్ ఇచ్చాడు. అయితే, ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న మోహన్ బాబు, సమీర్ దగ్గరకు వెళ్లి.. ‘నీ సంగతేంటో నేను చూస్తా !’ అని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.