S.S Rajamouli: టాలీవుడ్ సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తెలిపిన దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి చిత్రం ద్వారా తెలుగు సినిమా జాతిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయనకు అభిమానులు సెలబ్రిటీల నుంచి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు సినీ సెలబ్రిటీలు జక్కన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగనుంది. ఈ క్రమంలోనే రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ లో నటించిన తారక్, చరణ్, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ రాజమౌళికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇక రాజమౌళి ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే ఇందులో అజయ్ దేవగన్ విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో స్టార్ హీరోలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఈ సినిమా కోసం ఇటు మెగా అభిమానులు, అటు నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.