మోడీని ఇరుకున పెట్టే ప్రశాంత్ కిషోర్ ప్లాన్ ఇదే

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వచ్చే ఎన్నికల్లో తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రతిపక్షాలను ఏకం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీకి వ్యతరేకంగా పోరాడేందుకు పావులు కదుపుతున్నారు. ఇటీవల ప్రశాంత్ కిషోర్ వరుసగా శరత్ పవార్, రాహుల్ గాంధీలతో సమావేశమయ్యారు. సమావేశాల పూర్తి సమాచారం బయటకు రాకపోయినా బీజేపీకి వ్యతిరేకంగా మూడో కూటమి ప్రయత్నాలు మాత్రం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. వరుస సమావేశాలు రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ […]

Written By: Srinivas, Updated On : July 14, 2021 9:22 pm
Follow us on

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వచ్చే ఎన్నికల్లో తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రతిపక్షాలను ఏకం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీకి వ్యతరేకంగా పోరాడేందుకు పావులు కదుపుతున్నారు. ఇటీవల ప్రశాంత్ కిషోర్ వరుసగా శరత్ పవార్, రాహుల్ గాంధీలతో సమావేశమయ్యారు. సమావేశాల పూర్తి సమాచారం బయటకు రాకపోయినా బీజేపీకి వ్యతిరేకంగా మూడో కూటమి ప్రయత్నాలు మాత్రం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. వరుస సమావేశాలు రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ స్టాలిన్ విజయంలో కీలక పాత్ర పోషించిన పీకే ప్రస్తుతం బీజేపీయేతర పార్టీల ఏకీకరణకు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మూడో ఫ్రంట్ ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సమావేశం బీజేపీ, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష రాజకీయ పోరాటానికి కొత్త కోణాన్ని జోడించింది. ఇది వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల చుట్టూ కేంద్రీకృతమై ఉండవచ్చు.

ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ జగన్మోహన్ రెడ్డి, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, ఉద్దవ్ ఠాక్రేలతో వ్యక్తిగత సంబంధాలున్న ప్రశాంత్ కిషోర్ ప్రతిపక్షాలను కట్టుకోవడం సులభమే. దీనికి కాంగెస్ ను సైతం దారిలోకి తెచ్చుకోవాలి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో జరిగిన సమావేశంలో పలు కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిషోర్ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

రాజకీయ సమీకరణలు చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీని దెబ్బకొట్టే క్రమంలో మూడో కూటమి ఏర్పాటుకు చర్యలు ప్రారంభమైనట్లు సమాచారం. ప్రధాని మోడీని ఇరుకున పెట్టడానికి శరత్ పవార్ ను రాష్ర్టపతిగా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ ఎత్తుగడలతో ప్రతిపక్షాలు తమ పదునైన వ్యూహాలకు శ్రీకారం చుట్టనున్నట్లుసమాచారం. దీంతో బీజేపీయేతర పార్టీల ప్రోత్సాహంతోనే పీకే తన వ్యూహం సాధించుకోవడం కోసం పాటుపడుతున్నారు.