https://oktelugu.com/

ఇష్టమున్నట్టు ఉద్యోగులను తీసేయండి.. మోడీ దారుణ నిర్ణయం?

ఎవరైనా ప్రజాపక్షం వహించాలి. కానీ ఎందుకో కేంద్రంలోని మోడీ సర్కార్ వచ్చాక కార్పొరేట్ పక్షం వహిస్తోందన్న విమర్శలను మూటగట్టుకుంది. ఇప్పుడు ప్రవేశపెడుతున్న రైతు బిల్లుల నుంచి తాజాగా పెట్టిన కంపెనీల బిల్లు వరకూ అన్ని కార్పొరేట్లకు దోచిపెట్టడమే పనిగా కేంద్రం నిర్ణయాలున్నాయని తాజాగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Also Read: ప్రధానితో భేటికి కేసీఆర్, జగన్.. ఏం జరుగుతోంది? ఇటీవల మోడీ బర్త్ డే సందర్భంగా రాహుల్ ‘జాతీయ నిరుద్యోగ దినోత్సవం’ అని హ్యాష్ ట్యాగ్ పెట్టి మోడీపై […]

Written By:
  • NARESH
  • , Updated On : September 20, 2020 / 01:43 PM IST

    Loksabha

    Follow us on


    ఎవరైనా ప్రజాపక్షం వహించాలి. కానీ ఎందుకో కేంద్రంలోని మోడీ సర్కార్ వచ్చాక కార్పొరేట్ పక్షం వహిస్తోందన్న విమర్శలను మూటగట్టుకుంది. ఇప్పుడు ప్రవేశపెడుతున్న రైతు బిల్లుల నుంచి తాజాగా పెట్టిన కంపెనీల బిల్లు వరకూ అన్ని కార్పొరేట్లకు దోచిపెట్టడమే పనిగా కేంద్రం నిర్ణయాలున్నాయని తాజాగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    Also Read: ప్రధానితో భేటికి కేసీఆర్, జగన్.. ఏం జరుగుతోంది?

    ఇటీవల మోడీ బర్త్ డే సందర్భంగా రాహుల్ ‘జాతీయ నిరుద్యోగ దినోత్సవం’ అని హ్యాష్ ట్యాగ్ పెట్టి మోడీపై విమర్శలు చేయగానే.. అందరూ మోడీ నిరుద్యోగులను పట్టించుకోని తీరుపై రగిలిపోయి నిరుద్యోగులు ట్వీట్ల రూపంలో ఆయనకు నిరసన సెగ తగిలించారు. అయినా కూడా కేంద్రం ఉద్యోగులు, నిరుద్యోగుల విషయంలో మరోసారి అలాంటి నిర్ణయం తీసుకోవడం దుమారం రేపుతోంది.

    దేశంలో కరోనా వైరస్ ప్రబలి.. అన్ని మూతపడి కోట్ల మంది ఉద్యోగ, ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. ఇలాంటి టైంలో కేంద్రంలోని ప్రభుత్వం ఉపాధికి బాటలు చూపాల్సింది పోయి ఉన్న ఉద్యోగులను తీసేసేలా కంపెనీలకు చట్టం చేయడం దుమారం రేపుతోంది. ఈ కొత్తచట్టంపై నిరుద్యోగులు, ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

    తాజాగా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. 300 కంటే తక్కువ మంది ఉద్యోగులున్న కంపెనీలు తమ సంస్థలో ఎవరినైనా తీసేయాలనుకుంటే ప్రభుత్వ అనుమతి అవసరం లేదని తెలిపింది.
    గతంలో 100మంది కంటే తక్కువ ఉద్యోగులున్న కంపెనీలకు ఈ వెసులుబాటు ఉండేది.ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టారు.  కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త బిల్లుపై ట్రేడ్ యూనియన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

    Also Read: కార్పొరేట్ శక్తులకు అంతలా వణికిపోతున్నారెందుకు?

    కంపెనీలకు మేలు చేసేలా కేంద్రం చట్టం ఉందని ఉద్యోగులు, నిరుద్యోగులు మోడీ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు… కేంద్రంలోని మోడీ సర్కార్ కార్పొరేట్లకే దోచిపెడుతోందని.. నిరుద్యోగులు, ఉద్యోగుల బాధలు పట్టించుకోవడం లేదని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.