PM Modi- Russia Ukraine War: పాకిస్తాన్ దూషించవచ్చు గాక. ఇండియాలో ఉన్న ఎడమ చేతివాటం రాజకీయ నాయకులు, కెసిఆర్ లాంటివాళ్ళు తిట్టవచ్చు గాక.. కానీ ప్రపంచం మోదీని కొనియాడుతూనే ఉంటుంది. మోడీ కూడా ప్రపంచ క్షేమం కోసం తన వంతు బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉంటాడు.. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్లు సరఫరా చేసి తన ఉదారత చాటుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న శ్రీలంకకు చమురు, ఆహార ధాన్యాలు ఎగుమతి చేసి తన సహృదయతను ప్రదర్శించాడు.. అగ్రరాజ్యం అమెరికా గడ్డ పై హౌడీ మోడీ అనే ప్రోగ్రాం లో లక్షలాది మంది అమెరికన్ల అభిమానం చూరగొన్నాడు. ఇప్పుడు జీ_20 దేశాల సమ్మిట్ కు అధ్యక్ష బాధ్యత వహిస్తున్నాడు.. ప్రపంచ దేశాల వేదికలపై చైనా, పాక్ దుర్నీతిని ఎక్కడికక్కడ ఎండ గడుతున్నాడు.

యుద్దాన్ని ఆపాడు
గత ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైంది.. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. మొదట్లో ఉక్రెయిన్ కు మద్దతుగా ఉన్న నాటో దేశాలు తర్వాత చేతులు ఎత్తేసాయి.. దీంతో రష్యా ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. కీవ్, మారియా పోల్ లాంటి నగరాలను ఆక్రమించుకుంది. అంతేకాదు ఉక్రెయిన్ లోని ఆయిల్ రిపైనరీల మీద భీకర దాడులు చేసింది. దీంతో యూరప్ దేశాలకు చమురు రవాణా నిలిచిపోయింది. ఇంత జరుగుతున్నా అటు ఐక్య రాజ్య సమితి, ఇటు ఆమెరికా చోద్యం చూశాయి. పోరు నష్టం పొందు లాభం అన్న తీరుగా మిగతా దేశాలు వ్యవహరించాయి. ఒక్క భారత్ తప్ప. కానీ ఈవిషయం లో భారత్ ప్రపంచ క్షేమాన్ని కోరుకున్నది.

సీఐఏ కొనియాడింది
“నీ వెంట పది మంది ఉన్నారంటే ఒక యుద్దాన్ని గెలవచ్చు. అదే పది మందికి నువ్వు ఉన్నావనే నమ్మకం ఉంటే ఒక యుద్దాన్నే ఆపోచ్చు.” ఇది కేజీఎఫ్ లో రాఖీ కి అతడి తల్లి చెప్పే మాట. బహుశా దీన్నే మోడీ ఆచరణలో పెట్టాడు. ఏకంగా ఒక యుద్దాన్ని ఆపాడు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అణ్వాయుధ ప్రయోగం జరగకుండా చూశారు. దీనివల్ల పెను విద్వంసాన్ని తప్పించారు. మోడీ మాటలు, అతడి ప్రసంగాలు అణ్వాయుధాల వినియోగంపై రష్యన్ల పై ప్రభావం చూపాయి. అంతేకాదు పలు అంతర్జాతీయ వేదికల్లో యుద్ధం వల్ల జరిగే అనర్థాలను వివరించారు. మోడీ, బెలెన్ స్కీ తో కూడా మాట్లాడారు.. వీటివల్ల పుతిన్ మనసు మార్చుకున్నారు. అణ్వాయుధ యుద్దాన్ని పక్కన పెట్టారు. ఈ విషయాన్ని సీఐఏ డైరెక్టర్ బిల్ బర్న్స్ ఇటీవల వెల్లడించారు..మోడీ అణు యుద్దాన్ని ఆపారు అని కొనియాడారు.