PM Modi- Telangana: తెలంగాణ ప్రభుత్వ తీరుపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజలను పేదలుగా మారుస్తూ వారిని మోసం చేస్తున్న ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేస్తోంది. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ తన పబ్బం గడుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నేతల మాటలు ఇక విశ్వసించే స్థితిలో ప్రజలు లేరు. పేదలకు న్యాయం చేస్తామని చెబుతూ వారిని బాధలకు గురి చేస్తున్న ప్రభుత్వ పాలనను అంతం చేస్తాం. ప్రభుత్వాన్ని కూలదోస్తాం. ప్రజలకు ద్రోహం చేస్తే సహించేది లేదు. అంతు చూస్తాం. అడుగున తొక్కేస్తాం. అవినీతి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధపడుతోంది. భవిష్యత్ లో జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను నిలువరించాలని భావిస్తోంది.

నలుదిక్కుల కారు చీకట్లు కమ్ముకుంటున్నా వెలుగులోనే ఉన్నామనే భ్రమలో తెలంగాణ ప్రభుత్వం జోగుతోంది. పాలకుల వైఫల్యాన్ని ఎండగట్టి ప్రజనలను చైతన్యులను చేసే క్రమంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. దీని కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు బీజేపీ వెంట ఉన్నారనేందుకు వారు వేసిన ఓట్లే సాక్ష్యం. టీఆర్ఎస్ ఎంత డబ్బు ఖర్చు చేసినా ప్రజలు మాత్రం బీజేపీకి ఓటింగ్ శాతం పెంచడం దీన్ని రుజువు చేస్తోంది.
నలుదిక్కుల చిమ్మచీకట్లు ముసురుకుంటున్న సమయంలోనే కమలం వికసిస్తుంది. ప్రజామోదంతోనే తెలంగాణలో బీజేపీ ప్రతిష్ట పెరుగుతోంది. దీంతో అధికార పార్టీ టీఆర్ఎస్ కు మింగుడు పడటం లేదు. అందుకే రకరకాల రీతిలో ప్రేలాపణలు పేలుతోంది. అయినా బీజేపీ మాత్రం ఊరుకోదు. తెలంగాణలో అధికార పీఠం దక్కించుకునే వరకు విశ్రమించదు. దీనికి గాను ఎవరిని వదిలిపెట్టదు. మంత్రివర్గంలో కూడా అవినీతి పరులు ఉండటంతో పథకాలు ప్రజల చెంతకు చేరడం లేదు. పాలనలో అవినీతి పెరిగిపోతోంది.

ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోస్తామని చెప్పడం గమనార్హం. అదుగో దొంగ అంబే భుజాలు పునుక్కున్నట్లు ఎమ్మెల్యేల ఎర కేసులో తెలంగాణ ఎమ్మెల్యేలదే తప్పయినా బీజేపీ మీద నెపం నెడుతున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇందులో దోషులెవరో తేలితే అందరి బండారాలు బయట పడతాయి. పేదలను దోచుకుంటున్న ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని చెబుతున్నారు. ఎవరిని వదిలిపెట్టేది లేదని మోడీ చెప్పడంతో తెలంగాణ నేతల్లో వణుకు పుడుతోంది.