https://oktelugu.com/

‘నిసర్గ’ తుఫాన్ పై మోడీ ట్వీట్!

‘నిసర్గ’ తుపాన్ పై ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరి క్షేమం కోసం ప్రార్థిస్తున్నానని మోడీ ట్వీట్ చేశారు. నిసర్గ తుపాన్ ఉత్తర మహారాష్ట్ర, పక్కనే ఉన్న దక్షిణ గుజరాత్ మధ్య హరిహరేశ్వర్, దమన్ వద్ద తీరం దాటనున్నట్టు భారత వాతావరణశాఖ(ఐఎండి) అధికారి, ముంబై వాతావరణశాఖ డిప్యూటీ డైరెక్టర్ కెఎస్ హోసాలికర్ తెలిపారు. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ ‘నిసర్గ’ 12 గంటల్లో తీవ్ర తుపాన్‌ గా మారనున్నట్టు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర […]

Written By: , Updated On : June 2, 2020 / 08:15 PM IST
Follow us on

Modi tweet

‘నిసర్గ’ తుపాన్ పై ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరి క్షేమం కోసం ప్రార్థిస్తున్నానని మోడీ ట్వీట్ చేశారు. నిసర్గ తుపాన్ ఉత్తర మహారాష్ట్ర, పక్కనే ఉన్న దక్షిణ గుజరాత్ మధ్య హరిహరేశ్వర్, దమన్ వద్ద తీరం దాటనున్నట్టు భారత వాతావరణశాఖ(ఐఎండి) అధికారి, ముంబై వాతావరణశాఖ డిప్యూటీ డైరెక్టర్ కెఎస్ హోసాలికర్ తెలిపారు. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ ‘నిసర్గ’ 12 గంటల్లో తీవ్ర తుపాన్‌ గా మారనున్నట్టు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలనుద్దేశిస్తూ.. దేశంలోని పశ్చిమ తీరంలో నెలకొన్న తుపాన్ పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని, సురక్షితంగా ఉండటానికి వీలైన జాగ్రత్తలన్నీ తీసుకోవాలని ప్రధాని ప్రజలకు సూచించారు. అలాగే, తుపాన్ పరిస్థితిపై ఐఎండి అధికారులతో ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించారు. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్ప పీడనం వల్ల తుపాన్ రానున్నట్టు అధికారులు ప్రధానికి వివరించారు.

తుపాన్ హెచ్చరికలతో ఇప్పటికే 10 ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను తీర ప్రాంతాలకు తరలించినట్టు మహారాష్ట్ర ముఖమంత్రి కార్యాలయం(సిఎంఓ) తెలిపింది. తమ రాష్ట్రంలో మొత్తం 16 ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలున్నట్టు సిఎంఓ తెలిపింది. ముంబై నగరంతోపాటు శివారు ప్రాంతాలైన థానే, పాల్ఘర్, రాయిగడ్, రత్నగిరి, సింధుదర్గ్ జిల్లాలను అప్రమత్తం చేసినట్టు తెలిపింది. సహాయక చర్యల సందర్భంగా కోవిడ్19 విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించినట్టు సిఎంఓ తెలిపింది.