‘బీహార్‌ ఎన్నికల కోసం బీజేపీ గల్వాన్‌ నాటకం!’

ఒకప్పుడు శివసేన, బీజేపీ కలిసి కట్టుగా ఉండేవి. రెండు పార్టీలు కూటమిలో మహారాష్ట్రలో గత ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు రెండు పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే మడేంత విమర్శల యుద్ధం జరుగుతోంది. ఈ రోజు శివసేన ప్రధాని మోడీ పై ఘాటైన విమర్శలు చేసారు. రానున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ.. లఢాఖ్‌ లోని గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో భారత సైనికుల ఘర్షణ నాటకం ఆడుతున్నదని శివసేన […]

Written By: Neelambaram, Updated On : June 26, 2020 7:15 pm
Follow us on

ఒకప్పుడు శివసేన, బీజేపీ కలిసి కట్టుగా ఉండేవి. రెండు పార్టీలు కూటమిలో మహారాష్ట్రలో గత ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు రెండు పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే మడేంత విమర్శల యుద్ధం జరుగుతోంది.

ఈ రోజు శివసేన ప్రధాని మోడీ పై ఘాటైన విమర్శలు చేసారు. రానున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ.. లఢాఖ్‌ లోని గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో భారత సైనికుల ఘర్షణ నాటకం ఆడుతున్నదని శివసేన ఎద్దేవా చేసింది. భారత సైనికుల త్యాగాన్ని ఉపయోగించుకొని బీహార్‌ ఎన్నికల్లో లబ్ధి పొందాలని నరేంద్ర మోదీ యోచిస్తున్నారని తీవ్రమైన ఆరపణలు చేసింది. బీహార్‌ లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘కుల, ప్రాంతీయ కార్డు’ రాజకీయాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.

ఇటీవల గల్వాన్‌ వ్యాలీలో చైనా-ఇండియా సైనికుల ఘర్షణ అనంతరం “ఈ రోజు, నేను బీహార్ ప్రజలతో మాట్లాడుతున్నాను, ప్రతి బిహారీ చైనా సైన్యంతో పోరాడుతున్న వారి శౌర్యం గురించి గర్వపడుతున్నారు. నేను బిహారి రెజిమెంట్‌ అమరులకు నివాళులు అర్పిస్తున్నాను.” అని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై శివసేన తమ అధికార పత్రిక సామ్నాలో సంపాదకీయం రాసింది. “ప్రధాని మోడీ అటువంటి రాజకీయాల్లో నిపుణుడు. గల్వాన్‌ వ్యాలీలోని ‘బీహార్ రెజిమెంట్’ యొక్క శౌర్యాన్ని ఆయన ప్రశంసించారు. అంతకుముందు, దేశం సరిహద్దుల్లో ముప్పును ఎదుర్కొన్నప్పుడు మహర్, మరాఠా, రాజ్‌ పుత్, సిక్కు, గూర్ఖా, డోగ్రా రెజిమెంట్లు పనిలేకుండా కూర్చున్నాయా? రాబోయే బీహార్ ఎన్నికల కారణంగా భారత సైన్యంలో కులం, ప్రాంతాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటువంటి రాజకీయాలు ఒక వ్యాధి వంటివి. ఇది కరోనా వైరస్ కంటే తీవ్రమైనది” అని వ్యాఖ్యానించింది.