బెంగాల్ పై రంగంలోకి దిగుతున్న మోదీ

ఇప్పటి వరకు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వ్యూహరచన విషయంలో అమిత్ షా, ఇతర నేతలు కీలకంగా వ్యవహరిస్తూ ఉండేవారు. కానీ వరుసగా ఒకొక్క రాష్ట్రంలో ఎదురవుతున్న పరాజయాల దృష్ట్యా పశ్చిమబెంగాల్‌లో ఈ ఏడాదిలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి ప్రచార వ్యూహన్ని రూపొందించడంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లు కనిపిస్తున్నది. ముందుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆ రాష్త్రానికి చెందిన పార్టీ ఎంపీలు, ఇతర ముఖ్యనేతలతో విడివిడిగా సమాలోచనలు […]

Written By: Neelambaram, Updated On : March 10, 2020 1:07 pm
Follow us on

ఇప్పటి వరకు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వ్యూహరచన విషయంలో అమిత్ షా, ఇతర నేతలు కీలకంగా వ్యవహరిస్తూ ఉండేవారు. కానీ వరుసగా ఒకొక్క రాష్ట్రంలో ఎదురవుతున్న పరాజయాల దృష్ట్యా పశ్చిమబెంగాల్‌లో ఈ ఏడాదిలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి ప్రచార వ్యూహన్ని రూపొందించడంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లు కనిపిస్తున్నది.

ముందుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆ రాష్త్రానికి చెందిన పార్టీ ఎంపీలు, ఇతర ముఖ్యనేతలతో విడివిడిగా సమాలోచనలు జరుపుతూ, ఒకొక్క లోక్ సభ నియోజకవర్గ పరిధికి సంబంధించి సవివరంగా సమాలోచనలు జరుపుతున్నారు. అక్కడి రాజకీయ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఒక పక్క బడ్జెట్ సమావేశాలు జరగుతుండగా మరోవంక ఆ రాష్ట్ర బిజెపి ఎంపిల్లో ఒక్కొక్క ఎంపితో వేర్వేరుగా చర్చిస్తున్నారు. తమ ప్రభుత్వ పథకాలపై పేరుప్రతిష్టలు తెచ్చే అభిప్రాయాలను సేకరిస్తున్నారు. వీటన్నిటినీ సమీకరించి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి దిగాలన్నదే ప్రధాని అభిప్రాయంగా కనిపిస్తున్నది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 42 స్థానాల్లో బిజెపి 18 స్థానాలను చేజిక్కించుకోవడం తెలిసిందే. అదే ఊపులో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గద్దెదించి, బిజెపిని అధికారమలోకి తీసుకు రావాలని పట్టుదలతో ఉన్నారు. హిందుత్వ వాదం ఆధారంగా మైనార్టీ అనుకూల తృణమూల్ వైఖరిని ఎండగట్టడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపి రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలన్నది బిజెపి లక్షంగా పెట్టుకుంది.

ఈ నేపథ్యంలో ప్రతి ఎంపిని కలుసుకుని రాజకీయ, అబివృద్ధి అంశాలపై వారితో చర్చించాలని మోడీ నిర్ణయించినట్టు పశ్చిమబెంగాల్ బిజెపి అధ్యక్షుడు దిలీప్‌ఘోష్ చెప్పారు. ఎన్నికల్లో గెలవాలంటే ఏది అవరసరం అని ఆరా తీస్తున్నారని చెబుతున్నారు.

మరోవంక, ఏప్రిల్ తరువాత ప్రతి నెల మూడుసార్లయినా రాష్ట్రంలో పర్యటిస్తానని అమిత్‌షా హామీ ఇచ్చారని ఘోష్ చెప్పారు. వచ్చే సంవత్సరం కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాలతోపాటు పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.