KCR Vs Modi: భారతీయ జనతా పార్టీ నిన్నటి నుంచి జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ముఖ్య నేతలందరు హాజరై పార్టీ ఉద్దేశాలను చెబుతున్నారు. ప్రతిపక్షాలు మాత్రం చురకలు అంటిస్తున్నాయి. ప్రధాని ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కొన్ని ప్రశ్నలు సంధించారు. నగరంలో నిర్వహించే సమావేశాల్లో బీజేపీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు తంటాలు పడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తీరును కేసీఆర్ ఖండిస్తున్నారు.

ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్నారు. నల్లధనం వెలికి తీస్తామన్నారు. ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అవినీతి రహిత దేశంగా తీర్చిదిద్దుతామని హామీలు ఇచ్చినా ఇంతవరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. దేశ ప్రజల అభ్యున్నతి కోసమే రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తున్నాం. బీజేపీ తమ అభ్యర్థిగా ద్రౌపది ముర్మును నిలబెట్టినా తమ అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాని తాము ప్రతిపాదిస్తున్నాం. యశ్వంత్ సిన్హా గెలుపు కోసం అందరు సహకరించాలని కోరుతున్నారు.
Also Read: KCR- PM Modi Meeting: తన పరువు తానే పోగొట్టుకున్న కేసీఆర్!
రాష్ట్రపతిగా రాజకీయనుభవం ఉన్న వారు ఉంటేనే పనులు సాఫీగా సాగుతాయి. అంతేకాని ఎలాంటి అనుభవాలు లేని వారిని తీసుకొచ్చి రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టడంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలు సరిగా లేవని చెబుతున్నారు. బీజేపీకి భంగపాటు తప్పదని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రజా వ్యతిరేక విధానాలతో బీజేపీ ఎన్నో తప్పులు చేస్తుందని వాపోతున్నారు. అందుకే తమ అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను నిలబెట్టినట్లు తెలుస్తోంది. మోడీ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మోడీ సేల్స్ మెన్ గా వ్యవహరిస్తున్నారు. ధనవంతుల కొమ్ము కాస్తూ ప్రజలను మాత్రం అగాధంలోకి తోస్తోంది. ఫలితంగా దేశ భవిష్యత్ అంధకారంలో పడుతోంది. మోీ పాలనలో దేశం అధోగతి పాలవుతోంది. ఈ సందర్భంలో మోడీ పాలనలో ప్రజలు సమిధలుగా మారుతున్నారు. పరిపాలనలో విశేష అనుభవం ఉన్న యశ్వంత్ సిన్హా రాష్ట్రపతిగా సరైన వ్యక్తి అని కొనియాడారు. అధికార పార్టీ బీజేపీ కుట్రలను సాగనివ్వం. మా అభ్యర్థి గెలుపునకే ప్రాధాన్యం ఇస్తాం. యశ్వంత్ సిన్హాను గెలిపించుకుని సత్తా చాటుతాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. శ్రీలంకకు సాయం చేయకుండా ప్రధాని మోడీ వ్యవహరించిన తీరుపై కేసీఆర్ విమర్శించారు. ఆ దేశస్తులు ఎంతో నమ్మకం పెట్టుకున్నా మోడీ వారి కోర్కెలను తీర్చకపోవడం విడ్డూరమే. దీంతో వారు భారత్ ను నిందిస్తున్నారు. దీనికి మోడీ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
Also Read: BJP Aim To Win Telangana: తెలంగాణలో విజయసంకల్పమే బీజేపీ లక్ష్యమా?
[…] Also Read: KCR Vs Modi: ప్రధాని కాదు.. దేశానికి సేల్స్ మె… […]
[…] Also Read:KCR Vs Modi: ప్రధాని కాదు.. దేశానికి సేల్స్ మె… […]
[…] Also Read:KCR Vs Modi: ప్రధాని కాదు.. దేశానికి సేల్స్ మె… […]