Free Ration: పంటలెక్కువైనా ఈ పథకాలెందుకు.. ప్రతి ఇంట్లో సంతాన పరిమితి లేనందుకు అనే నినాదంతో పేదలకు బియ్యం పంపిణీ పథకాన్ని 1986లో ఎన్టీఆర్ ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పుడు ఇది దేశవ్యాప్త పథకంగా మారింది. ఈ నేపథ్యంలో 2020లో వచ్చిన కరోనా కారణంగా ఉచిత బియ్యం అందజేస్తున్నారు. ఒక్కొక్కరికి పది కిలోల చొప్పున ఇంట్లో ఎంత మంది ఉంటే అంత బియ్యం పంపిణీ చేస్తున్నారు. కరోనా నుంచి బియ్యం ఉచితంగా సరఫరా చేస్తోంది. ప్రస్తుతం కరోనా రక్కసి మళ్లీ జడలు విప్పుతుండటంతో ఉచిత బియ్యం పథకాన్ని మరో ఏడాది కొనసాగించనున్నట్లు పేర్కొంది. ప్రధానమంత్రి మోడీ తీసుకున్న నిర్ణయంతో దేశ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.

కొత్త సంవత్సరం సందర్బంగా మరోమారు కేంద్రం ప్రజలకు తీపి కబురు అందించింది. ఉచిత బియ్యం పంపిణీని కొనసాగిస్తన్నట్లు ప్రకటించింది. దీంతో కేంద్రంపై రూ.2 లక్షల కోట్ల మేర భారం పడనుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. జాతీయ ఆహార భద్రత చట్టం కింద 81 కోట్ల మందికి రేషన్ అందించనున్నారు. కేంద్రమే ఈ భారాన్ని భరిస్తుందని తెలిపారు. వచ్చే ఏడాది డిసెంబర్ వరకు ఉచిత బియ్యం పంపిణీని పేదలకు బహుమతిగా అందించనున్నారు. ఈ స్కీం కింద నెలకు ఐదు కిలోల చొప్పున ఆహార ధాన్యాలను కేంద్రం అందించనుంది.
అంత్యోదయ అన్న యోజన పథకం కింద ఒక్కో కుటుంబానికి 35 కిలోల బియ్యం అందిస్తోంది. కరోనా ప్రారంభంలో లాక్ డౌన్ కారణంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం గడువు డిసెంబర్ తో ముగియనుంది. మళ్లీ ఈ పథకాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కరోనా కేసులు పెరుగుతున్నందున కేంద్రం మళ్లీ ఈ స్కీమ్ ను కొనసాగించి ప్రజలకు ఉచిత రేషన్ అందించేందుకు నిర్ణయించుకుంది. నూతన సంవత్సరం సందర్భంగా కేంద్రం మరోసారి గిఫ్ట్ అందించనుంది.

దీంతో పాటు మరో నిర్ణయం తీసుకుంది. సాయుధ బలగాల పింఛన్ ను వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కింద సవరించడానికి ఆమోదం తెలిపింది. దీంతో 25 లక్షల మంది వెటరన్స్ కి లాభం కలగనుంది. పెన్షన్ సవరణతో కేంద్రంపై రూ.8,500 కోట్ల అదనపు భారం పడుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రజల కోసమే ఈ పథకాలను ఆమోదం తెలపడం దేశ ప్రజలకు ఇచ్చిన వరంగానే చెబుతున్నారు. కేంద్రం తీసుకున్ని నిర్ణయం అందరికి ఆమోదయోగ్యంగానే ఉందని చెబుతున్నారు. కేంద్రం ప్రజల కోసం రేషన్ ను ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు రావడం గమనార్హం.