మోదీ ‘సర్కారువారి పాట’.. త్వరపడండి..

నిరుపేద భారతం నిర్మూలన కావాలి.. అందరూ సంపన్నులుగా మారాలి. దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి. వ్యవసాయంలో నూతన సంస్కరణలు రావాలన్న బీజేపీ ప్రభుత్వం మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదు. ఓ వైపు ప్రపంచ దేశాలు భారత్ వైపు కన్నెత్తి చూస్తున్నాయంటూనే.. ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు పరం చేస్తున్నారు మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. వరుసపెట్టి కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్నారు. ధనికులకు కొమ్ముకాస్తూ.. కార్మికుల పొట్టపై కొడుతున్నారు. ఇంత చేస్తూనే ఇదంతా కొన్ని శక్తులు […]

Written By: Srinivas, Updated On : February 9, 2021 12:24 pm
Follow us on


నిరుపేద భారతం నిర్మూలన కావాలి.. అందరూ సంపన్నులుగా మారాలి. దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి. వ్యవసాయంలో నూతన సంస్కరణలు రావాలన్న బీజేపీ ప్రభుత్వం మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదు. ఓ వైపు ప్రపంచ దేశాలు భారత్ వైపు కన్నెత్తి చూస్తున్నాయంటూనే.. ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు పరం చేస్తున్నారు మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. వరుసపెట్టి కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్నారు. ధనికులకు కొమ్ముకాస్తూ.. కార్మికుల పొట్టపై కొడుతున్నారు. ఇంత చేస్తూనే ఇదంతా కొన్ని శక్తులు చేస్తున్న కుట్రగా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి మాటలు చేతలు.. కేవలం మోదీతోనే సాధ్యం అవుతుందని అంటున్నారు ప్రజలు.

Also Read: ఉత్తరాఖండ్ వరద బీభత్సానికి కారణం ఏమిటీ..?

ఒకటి తరువాత ఒకటి చొప్పున ప్రభుత్వ సంస్థలను అమ్మకానికి పెడుతున్న కేంద్రం.. తాజా బెల్(భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్) అలియాస్ బీహెచ్ ఈఎల్ లో వాటాల అమ్మకానికి సిద్ధమైంది. ఇప్పటికే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటుపరం చేసేందుకు తెగ ఉత్సాహం చూపుతున్న మోదీ సర్కారు.. ఈసారి బీహెచ్ఈఎల్ మీద ఫోకస్ పెట్టారు. దేశంలోని పది నవరత్న కంపెనీల్లో ఒకటైన బల్ లో దాదాపు 33500 మంది పని చేస్తున్నారు. మొత్తం 16 ఉత్పాదక కేంద్రాలు ఉన్నాయి. బొగ్గు, గ్యాస్, జల, అణు ఆధారిత విద్యత్ ఉత్పత్తికి అవసరమైన సాంకేతికతను ఈ సంస్థ అందిస్తోంది.

అయితే గత ఆర్థిక సంవత్సరంలో సంస్థకు రూ.1473 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. దీంతో రంగంలోకి దిగిన కేంద్రం బీహెచ్ ఈఎల్ ను ప్రయివేటుకు అమ్మేందుకు సిద్ధం అయ్యింది. బేల్ లోని వాటాలను కొనుగోలు చేసేందుకు మెకాన్ లిమిటెడ్.. అండ్రూ ఊలే అండ్ కో సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు చెబుతున్నారు. ఈ వాటాల విక్రయానికి ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ సలహాదారా వ్యవహరిస్తోంది.

Also Read: వెంకయ్యకు విజయసాయి క్షమాపణలు

నష్టాలు వచ్చాయని, ప్రతీ కంపెనీని అమ్ముకుంటూ పోవడమేనా..? అన్నది ఇప్పుడు ఉత్పన్నం అవుతున్న ప్రశ్న. నష్టాలు వచ్చినప్పుడు.. ఎందుకు వచ్చాయి? దాన్ని ఎలా అధిగమించాలి..? లోపాలు ఏమిటి.. అన్న ప్రశ్నలు వేసుకుంటూ.. లాభాల్లోకి వచ్చేలా ప్రయత్నం చేయాలి. అందుకు భిన్నంగా అమ్మేసుకుంటూ.. పోతే.. ఇక మిగిలేది ఏమీ ఉండదన్న ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు. సంస్థలను అమ్మేయడం ఒక వ్యూహం అంటూ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ వ్యాఖ్యలు అవాక్కు చేస్తున్నాయి. వావ్ మోదీజీ ఏం ప్లానింగ్ అంటూ సోషల్ మీడియాలో వ్యంగంగా వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్