
Narendra Modi: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దీపావళి పండుగకు మూడు శుభవార్తలు చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు మార్గాలలో డబ్బులు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తుండగా ఈ వార్తలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడాల్సి ఉంది. కేంద్రం ఇప్పటికే ఉద్యోగుల డియర్ నెస్ అలవెన్స్ ను పెంచింది.
జులై నుంచి డిసెంబర్ కాలానికి డీఏ పెంపు ఉండవచ్చని సమాచారం. డియర్ నెస్ అలవెన్స్ 31 శాతం వరకు పెరిగే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. మూడు శాతం వరకు డీఏ పెరగవచ్చని వస్తున్న వార్తల వల్ల ఉద్యోగులు సంతోషిస్తున్నారు. మోదీ సర్కార్ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ కు సంబంధి తీపికబురు అందించడానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. త్వరలో కేంద్రం వడ్డీని పీఎఫ్ ఖాతాలలో జమ చేయనుందని తెలుస్తోంది.
మోదీ(Narendra Modi) సర్కార్ 18 నెలల ఎరియర్స్ కు సంబంధించిన అంశాన్ని కూడా పరిశీలిస్తోందని సమాచారం. డీఏ ఎరియర్స్ కు సంబంధించి త్వరలో కీలక ప్రకటన వెలువడే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో ఎరియర్స్ కు సంబంధించి కీలక ప్రకటనను వెల్లడించే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది. త్వరలోనే ఈ అంశానికి సంబంధించి అధికారికంగా క్లారిటీ రానుంది.
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూలంగా తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డీఏ మూడు శాతం పెరిగినా ఉద్యోగులకు భారీగా ప్రయోజనం చేకూరే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.