https://oktelugu.com/

Pakistan Occupied Kashmir: POK స్వాధీనం దిశగా మోడీ సర్కార్ అడుగులు.. కార్గిల్ సెక్టార్ లో ఎలాంటి ప్లాన్ అమలు చేస్తోందంటే..

పాక్ ఆక్రమిత కాశ్మీర్ వల్ల మన దేశం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదం తారస్థాయిలో ఉంటున్నది.

Written By: , Updated On : March 8, 2025 / 10:23 AM IST
Pakistan Occupied Kashmir

Pakistan Occupied Kashmir

Follow us on

Pakistan Occupied Kashmir: ఆర్టికల్ 370 రద్దు.. త్రిబుల్ తలాక్ రద్దు.. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో ఎన్నికలు.. అయోధ్య రామ మందిర నిర్మాణం.. ఇలా చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు మామూలువికావు. అయితే వీటన్నింటికి మించేలాగా నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇది గనక వాస్తవ రూపం దాల్చితే పాకిస్తాన్ ఇక ఎప్పటికీ మన జోలికి రాదు. అంతేకాదు ఎన్నికల్లో బిజెపికి మనదేశంలో ఎదురనేదే ఉండదు.

Also Read: CT రద్దయితే ఐసిసి ఏం చేస్తుంది? ఛాంపియన్ ను ఎలా నిర్దేశిస్తుంది?

పాక్ ఆక్రమిత కాశ్మీర్ వల్ల మన దేశం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదం తారస్థాయిలో ఉంటున్నది. ఇక్కడ వేర్పాటువాదులు అధికంగా ఉండటం వల్ల సరిహద్దుల్లో నిత్యం ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఉగ్రవాదులకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ రక్షణ స్థావరం గా ఉండడంతో.. అక్కడ నక్కిన ఉగ్రవాదులు మన దేశ సైన్యంపై నిత్యం కాల్పులకు తెగబడుతున్నారు. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటనలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాదులు స్కెచ్ వేసినవే. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎప్పటినుంచో సంకల్పించింది. అయితే దానికి తగ్గట్టుగా పరిస్థితులు రావాలని కోరుకున్నది. ఇప్పుడు అవి వాస్తవ రూపం దాల్చేలాగా కనిపిస్తున్నాయి.

నిపుణులు ఏం చెబుతున్నారంటే

పాక ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనంపై నరేంద్ర మోడీ ప్రభుత్వం సీరియస్ గా గురి పెట్టిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్గత వివాదాలతో పాకిస్థాన్ ప్రస్తుతం అట్టుడుకుతున్నది. పాకిస్తాన్ నుంచి బలుచిస్తాన్ స్వాతంత్రం కావాలని కోరుకుంటున్నది. మరోవైపు తాలిబన్లు డ్యూరాండ్ రేఖను ఆక్రమించడం మొదలుపెట్టారు. ఇక దీనికి తోడు కార్గిల్ ప్రాంతంలో భారత్ అతిపెద్ద యుద్ధ విమానాన్ని ల్యాండ్ చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనంతో కాశ్మీర్ సమస్య ముగుస్తుందని లండన్లో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు మొత్తం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ స్వాధీనం చేసుకునేలాగా కనిపిస్తున్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.. మరోవైపు వాస్తవాధీనరేఖ వద్ద భారత యుద్ధ విమానం C-17 MON అత్యంత రహస్యంగా ల్యాండ్ అయింది. సముద్ర మట్టానికి 9700 అడుగుల ఎత్తైన కార్గిల్ పర్వత ప్రాంతంలో ల్యాండింగ్ కు అత్యంత కష్టమైన ప్రాంతానికి అది వెళ్లడం విశేషం. గతంలో వాయుసేన AN -32, C-130J సూపర్ హెర్క్యుల్ ను ఇక్కడ ఉపయోగించింది..AN -32 కేవలం 3-4, C- 130 J 6 నుంచి ఏడు టన్నుల సామగ్రి, సైనికులను మోసుకెళ్లగలదు. అనేక కృష్ణతరమైన ఆపరేషన్లలో పాలు పంచుకోగలదు. కార్గిల్ సెక్టార్ లో ఇంతటి యుద్ధ విమానాన్ని మొహరింపజేయడం చూస్తుంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనంపై నరేంద్ర మోడీ ప్రభుత్వం గట్టిగానే గురి పెట్టినట్టు తెలుస్తోంది. మరి తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది.

 

Also Read: విరాట్ కోహ్లీకి కింగ్ అనే బిరుదు ఊరికే రాలేదు.. పరుగుల యంత్రం అని సరదాగా పిలవడం లేదు.. అతడు సాధించిన రికార్డులు ఇవి..