https://oktelugu.com/

Fuel Price: పెట్రో రేట్ల తగ్గింపు: పెంచింది కొండంత.. తగ్గించింది పిసరంత.. దీపావళి పండుగ చేసుకోవలట!

Fuel Price: పండుగ చేసుకోండి ప్రజలారా అని ప్రధాని మోడీ సార్ దీపావళి పూట పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10 తగ్గించేశారు.దీంతో బీజేపీ జనాలకు ‘బర్రె ఈనినంత’ పండుగవుతోంది. మోడీ సార్ తగ్గించాడహో అని తెగ ప్రచారం చేస్తున్నారు. నిజానికి పెట్రో రేట్లు పెంచింది కొండంతలా ఉంది. ఇప్పుడు తగ్గించింది పిసరంత.. ఈ పెట్రోల్ రేట్లు తగ్గించడానికి వారం ముందు వరకూ దాదాపు రూ.110 ఉండేది. ఈ పెంచడానికి ముందు నిన్నటికి రూ.118 దాటేసింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 4, 2021 9:16 am
    Follow us on

    Fuel Price: పండుగ చేసుకోండి ప్రజలారా అని ప్రధాని మోడీ సార్ దీపావళి పూట పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10 తగ్గించేశారు.దీంతో బీజేపీ జనాలకు ‘బర్రె ఈనినంత’ పండుగవుతోంది. మోడీ సార్ తగ్గించాడహో అని తెగ ప్రచారం చేస్తున్నారు. నిజానికి పెట్రో రేట్లు పెంచింది కొండంతలా ఉంది. ఇప్పుడు తగ్గించింది పిసరంత.. ఈ పెట్రోల్ రేట్లు తగ్గించడానికి వారం ముందు వరకూ దాదాపు రూ.110 ఉండేది. ఈ పెంచడానికి ముందు నిన్నటికి రూ.118 దాటేసింది. ఇప్పుడు మోడీసార్ పెట్రోల్ రేట్లు తగ్గించడంతో హైదరాబాద్ లో ఈరోజు పెట్రోల్ ధర రూ.114.47 అయ్యింది. దీనివల్ల ఎవరికి ఉపయోగం..? జనాలకు భారీగా తగ్గించారని ప్రచారం ఒకటి.. తగ్గించడం అంటే రూ.118 ఉన్న పెట్రోల్ పై ఓ రూ.50 తగ్గించాలి.. జనాలకు ఉపశమనం కలిగించాలి. కానీ రూ.5 తగ్గించే పండుగ చేసుకోమంటే ఎలా?

    petrol prices

    petrol prices

    మోడీ సర్కార్ ఈ తగ్గింపుతో లక్ష కోట్ల ఆదాయం తగ్గుతుందట.. నిజానికి ఈ పెట్రోల్ రేట్లు పెంపుదలతో మోడీ ఖజానాకు వేల కోట్లు ఆదాయం వస్తోందని లెక్కలు చెబుతున్నాయి. కరోనా కల్లోలం వేళ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టడానికి మోడీ సర్కార్ కు ఉన్న ప్రధాన ఆదాయ వనరులు ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇతర నిత్యావసరాలే. అన్నింటిని పెంచేసి ఇప్పుడు ఏదో ప్రజలను ఉద్దరించేస్తున్నామని.. భారీగా తగ్గించేశామని బీజేపీ శ్రేణులు సంబరపడుతున్నాయి.

    పెట్రోల్ రూ.5, డీజిల్ పై రూ.10 తగ్గిస్తున్నట్టుగా .. ఇది దీపావళి కానుక అని మోడీ సర్కార్ ప్రకటన చేసింది. ఈరోజు నుంచి తగ్గింపు ధరలు అమల్లోకి వస్తాయని అన్నది. నిజానికి కరోనా మొదటి వేవ్ లాక్ డౌన్ కు ముందు రూ.70 నుంచి రూ.80 మధ్యలో ఉన్న పెట్రోల్ రేట్లు ఏడాదిన్నరలోనే భారీగా పెరిగింది. ఏకంగా రూ.50వరకూ పెంచేశారు.

    అయితే పెట్రోల్ రేట్లు తగ్గించడం ఒకే. కానీ వీటి పెంపు వల్ల ఆకాశాన్ని అంటిన నిత్యావసరాల సంగతి ఏంటన్నది ఇప్పుడు సామాన్యుల ప్రశ్న. దీని గురించి కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. వంట నూనె నుంచి కూరగాయలు, పప్పులు ఉప్పులూ ఆఖరికి అగ్గిపెట్టే రేటు కూడా పెరిగింది. భవన నిర్మాణ ఖర్చులు, సిమెంట్ ఆకాశాన్ని అంటాయి. వీటి గురించి మాత్రం కేంద్రం నోరు మెదపడం లేదు.

    ప్రస్తుతం పెట్రో ఉత్పత్తుల ద్వారా కేంద్రానికి ఏడాదికి ప్రజల నుంచి కేవలం పన్నుల ద్వారానే రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.4 లక్షల కోట్ట ఆదాయం పొందుతోంది. ఈ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారే కానీ.. ప్రజల మీద కాస్త భారం తగ్గిద్దామని అనుకోవడం లేదు.

    ఇప్పుడు మాత్రం రూ.5 తగ్గించి అదేదో పెద్ద కానుక అన్నట్టుగా బీజేపీ శ్రేణులు ఊదరగొడుతున్నాయి. కొండంత పెంచి పిసరంత తగ్గించి జనాలను పండుగ చేసుకోండి అంటూ బీజేపీ నేతలు చెబుతున్నారు. అల్ప సంతోషికి అంతకంటే ఏం ఇస్తాం అంటూ ప్రజలను అవహేళన చేయడం తప్పితే ఈ పెంపు వల్ల ఉపయోగం లేదన్నది సామాన్యుల మాట!