Homeఅంతర్జాతీయంModi era of war comment: మోడీ లెక్క ఘోరంగా తప్పింది!

Modi era of war comment: మోడీ లెక్క ఘోరంగా తప్పింది!

Modi era of war comment: భారత ప్రధాని నరేంద్రమోదీ నాలుగేళ్ల క్రితం రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభం కాగానే ఒక ప్రకటన చేశారు. రష్యా, ఉక్రెయిన్‌ దేశాల ప్రతినిధులతో మాట్లాడి ఇది యుద్ధాల యుగం కాదని తెలిపారు. మోదీ ఈ మాట అన్నప్పటికీ ఆయన అంచనా తప్పింది. 2016 నుంచి 2026 మార్చి వరకు చూసినట్లయితే ప్రపంచ వ్యాప్తంగా అనేక యుద్ధాలు జరిగాయి. అంతర్జాతీయంగా యుద్ధాలను అధ్యయనం చేసే సంస్థ 78 దేశాలు పదేళ్లలో యుద్ధాలు చేశాయి. ఈ 78 దేశాలు 61 యుద్ధాల్లో పాల్గొన్నాయి. ఇందులో ప్రభుత్వాలు ఉన్నాయి. ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. స్వతంత్రం కోసం పోరాడే సంస్థల ఉన్నాయి. దీంతో యుద్ధాల యుగం కాదు అన్న మోదీ మాటలు తప్పేమో అని తెలుస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా కీలక యుద్ధాలు..
2016–2026లో 61 యుద్ధాలు జరిగాయి. ఇందులో ప్రభుత్వాలు, ఉగ్రవాద గుండాలు, విముక్తి సంస్థలు పాల్గొన్నాయి. యూరప్‌లో రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం మ్యాపులు మార్చింది. యూరప్‌లో ఉద్రిక్తత కొనసాగుతోంది. మాజీ రష్యా ప్రాంతం అజర్‌బైజాన్, ఉక్రెయిన్‌లో, గల్ఫ్‌లో 1948 నుంచి అనేక దేశాలు యుద్ధాల్లో ఉన్నాయి. ఆఫ్రికాలో, ఆసియాలో యుద్ధాలు జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల యుద్ధాలు, అంతర్గత తిరుగుబాట్లు జరిగాయి. ఉక్రెయిన్‌ యుద్ధం 2022, ఫిబ్రవరిలో మొదలైంది. 1948లో ముగిసిన రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద యుద్ధం ఇదే. మ్యాపును మార్చే యుద్ధంగా చెప్పవచ్చు. 1990–91లో సోవియన్‌ యూనియన్‌ పతనం అయిన తర్వాత యూరప్‌ జాగ్రఫీ మారింది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్‌ యుద్ధంలో ఆర్థిక నష్టం, జన నష్టం, సంపద నష్టం విపరీతంగా జరిగింది. ఏళ్ల తరబడి యుద్ధం కొనసాగడమే ఇందుకు కారణం.

ఇజ్రాయెల్‌ యుద్ధం..
ఇజ్రాయెల్‌ 2023 అక్టోబర్‌లో హమాస్‌కు చెందిన ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడిచేసి అనేక మందిని ఊచకోత కోశారు. దీంతో ఇజ్రాయెల్‌ గాజాపై దాడిచేసింది. ఇది రెండేళ్లు కొనసాగింది. ఆ తర్వాత లెబనాన్, హెజ్‌బొల్లాపై దాడి చేసింది. ఉగ్రవాద నాయకులను హతమార్చింది. ఇరాన్‌పైన కూడా 2025లో 12 రోజులు దాడి చేసింది. ఇదంతా గల్ఫ్‌లో ఉద్రిక్తలను తెలియజేస్తుంది. ఇక హూతీ రెబల్స్‌కు వ్యతిరేకంగా సౌదీ అరేబియా, అనుకూలంగా యూఏఈ కొట్టుకుంటున్నాయి. ఇక సిరియా అంతర్యుద్ధం మొదట్లో తర్వాత టర్కీ సహకారంతో యుద్ధం చేస్తోంది. అమెరికా టర్కీ అనుకూల సున్నీ ప్రభుత్వం ఏర్పడేలా చేసింది. ఇజ్రాయెల్‌ దక్షణ సిరియాపై దాడి చేసింది.

భారత్‌ యుద్ధం..
ఇక భారత్‌లో 2017లో డోక్లాం, 2020లో గల్వాన్‌ సంఘటన జరిగాయి. ఇవి పెద్ద యుద్ధాలు కాకపోయినా ఏళ్లపాటు సైన్యం మోహరించాల్సి వచ్చింది. 2025లో ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్, పాకిస్తాన్‌ మధ్య యుద్ధం జరిగింది. పాకిస్తాన్‌ శరణు వేడుకోవడంతో భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ను హోల్డ్‌లో పెట్టింది. 2025లో ఆఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌కు యుద్ధం జరిగింది. ఈ ఏడాది కూడా యుద్ధం కొనసాగుతోంది.

ఆఫ్రికాలో..
ఆప్రికాలోనూ సూడాన్, సౌత్‌ సూడాన్, సోమాలియా, ఇథియోపియా, కాంగోలోనూ యుద్ధాలు జరుగుతున్నాయి. నార్త్‌ కొరియా, సౌత్‌ కొరియా, కంబోడియా, థాయ్‌లాండ్‌ మధ్య యుద్ధాలు సాధారణం అయ్యాయి. అజర్‌బైజాన్, ఆర్మేనియా మధ్య యుద్ధం జరిగింది. 2022లో యుద్ధం జరిగినప్పుడు అజర్‌బైజాన్‌ ఆధిపత్యం కనబర్చింది. 2023లో జరిగిన యుద్ధంలో 1.5 లక్షల మంది ఆర్మేనియాకు వెళ్లారు.

మొత్తంగా 2016 నుంచి 2026 వరకు 61 యుద్ధాలు జరిగాయి. దీంతో మోదీ చేసిన ప్రకటన తప్పు అనిపిస్తుంది. భారత్‌ యుద్ధానికి సర్వదా సన్నద్ధంగా ఉంది. అందుకే గల్వాన్‌లో చైనాను, డోక్లాంలో చైనాను నిలువరించింది. మోదీకి ఏమాట చెప్పినా ఒక్కటి వాస్తవం. ప్రపంచంలో శాంతి కావాలంటే శక్తి ఉండాలి శస్త్రం కావాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular