Modi vs TRS: వరిధాన్యం కొనుగోలు చేయడం లేదని ఓవైపు తెలంగాణలో బీజేపీకి చావుడప్పు కొట్టింది టీఆర్ఎస్ పార్టీ. ప్రధాన మోడీ దిష్టిబొమ్మలను తాజాగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు దహనం చేశారు. అయితే తాజాగా ఢిల్లీకి వెళ్లి సమస్యపై మోడీకి వివరిద్దామని ఎంపీలు, మంత్రులు ప్రధాని అపాయింట్ మెంట్ కోరారు. అయితే మోడీ గట్టి షాకిచ్చినట్టు తెలిసింది.

శనివారం న్యూఢిల్లీకి వచ్చిన టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీల బృందం రెండు రోజులుగా మోడీ, కేంద్రవ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అపాయింట్ మెంట్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే టీఆర్ఎస్ నేతలు కేంద్రాన్ని చెడుగా చూపించి రాజకీయ మైలేజ్ పొందేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నారని బీజేపీ నాయకత్వానికి అర్థమైంది. దీంతో ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు ఎవరూ టీఆర్ఎస్ ప్రతినిధి బృందానికి అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదట..
ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి ఆడిపోసుకున్నారు. తెలంగాణ ప్రజల సమస్యలు తెలుపుదామంటే కనీసం కేంద్రం పెద్దలు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ‘వరి’కాటు మోడీ ‘అపాయింట్ మెంట్ ’నిరాకరించి గట్టి షాక్ యే ఇస్తున్నట్టు తెలుస్తోంది.