BJP vs TRS: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం పెరిగిపోతోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత మొత్తం ఫోకస్ బీజేపీపైనే పెట్టింది. గల్లీ లీడర్ నుంచి డిల్లీ నేతల వరకు అందరిని టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. మోడీపై విమర్శలకు దిగుతున్నారు. రాజ్యాంగాన్ని మోడీ అవమానించారని మూకుమ్మడిగా దాడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. నిన్న ప్రధాని దిష్టిబొమ్మల దహనం చేసి తమలోని అక్కసు వెళ్లగక్కారు.
తెలంగాణ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిదేళ్ల నాటి తెలంగాణ విషయాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించి ప్రధాని తప్పు చేశారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ప్రధానిపై విమర్శలు చేయడంతో బీజేపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. ప్రధాని వ్యాఖ్యలను తప్పుపట్టే అంత స్థాయి కేటీఆర్ కు లేదని చెబుతున్నారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానించారని కేసీఆర్ పై బీజేపీ చేసిన విమర్శలకు ప్రతిగానే ఇలా కేటీఆర్ మాట్లాడటం ఆయన తెలివితక్కువ తనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని తెలుస్తోంది. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ వ్యక్తిగత విమర్శల వరకు వెళుతూ తమ స్థాయిని మరిచిపోతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక విషయాలను కూడా లాగుతున్నారు. కర్ణాటకలో మత సామరస్యం పతనమవుతుందని ప్రస్తావిస్తున్నారు. విద్యార్థులను రెండు వర్గాలుగా విడగొట్టి రాజకీయం చేస్తుందని దుయ్యబడుతున్నారు.
Also Read: PM Modi Revanth reddy: మోడీ చెప్పింది నిజమా? కాదా? టీఆర్ఎస్, కాంగ్రెస్ మైండ్ గేమ్?
కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆడుకుంటోందని దాడికి దిగుతున్నారు. బీజేపీని టార్గెట్ చేసుకుని టీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగడం తెలుస్తోంది. మరోవైపు కేసీఆర్ మూడో కూటమి ఏర్పాటు చేసి బీజేపీని ఎదుర్కోవాలని భావిస్తున్నారు. అందుకోసమే పలు రాష్ట్రాల నేతలతో భేటీ అయి వారిని తమ వైపు తిప్పుకునేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.
దీంతో బీజేపీ, టీఆర్ఎస్ లు పరస్పరం విమర్శలకు దిగడం తెలుస్తోంది. ఈక్రమంలో బీజేపీని రాష్ట్రంలో ఎదగనీయకుండా చేయడమే లక్ష్యంగా కదులుతున్నట్లు సమాచారం. దీంతోనే రాజ్యాంగాన్ని సాకుగా చూపి బీజేపీ నేతలు, పార్లమెంట్ లో ప్రధాని వ్యాఖ్యలను తప్పుబడుతూ టీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని చెబుతున్నారు. అందుకే రెండు పార్టీలు ఎంత వరకు వెళతాయో తెలియడం లేదు.
Also Read: Sedition Case Against KCR: కేసీఆర్ పై రాజద్రోహం కేసు పెట్టేందుకు బీజేపీ రెడీ