AP Govt Employees vs Teachers: ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ లొల్లి ఇంకా చల్లారడం లేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు రెండుగా విడిపోయారు. సమ్మె చేయాలని తొలుత నిర్ణయించుకున్నా ప్రభుత్వం ఉద్యోగులను మాత్రం తమ వైపు తిప్పుకుంది. కానీ ఉపాధ్యాయులు మాత్రం మాట వినడం లేదు. సమ్మె చేయడానికే నిర్ణయించుకున్నారు. దీంతో ఉపాధ్యాయులపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఉద్యోగులతో ఏం చెప్పిందో ఏమో కానీ వారు సమ్మె విరమిస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో అటు ఉద్యోగులు, ఇటు ఉపాధ్యాయుల్లో వైరం పెరుగుతోంది. ఉద్యోగులు ఉపాధ్యాయులను టార్గెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయుల వెనుక ఎవరో ఉన్నారనే అనుమానాలు ప్రభుత్వం నుంచి వస్తోంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల తీరుపై విమర్శలు వస్తున్నా వారు మాత్రం లెక్కచేయడం లేదు. ప్రభుత్వంపై పోరాటానికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో చోటుచేసుకునే పరిణామాలతో ప్రభుత్వానికి ఎటు పాలుపోవడం లేదు. ఉపాధ్యాయుల తీరుతో విసిగిపోతోంది. వారి వెనుక ప్రతిపక్షాలు ఉండి నడిపిస్తున్నాయని ఆరోపణలు చేస్తోంది. కానీ వారు కూడా ఉపాధ్యాయుల కోరికలు తీరిస్తే బాగుండేది కదా ఎందుకు వారితో పెట్టుకోవడం మమ్మల్ని నిందించడం అని పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వ నిర్వాకంతోనే ఉపాధ్యాయులు సమ్మె దిశగా వెళ్తున్నట్లు తెలుస్తోంది.
పీఆర్సీ సాధన సమితి పేరుతో ఉద్యమం చేసినా ప్రస్తుతం ఉపాధ్యాయులు విడిపోవడంతో ఉద్యోగులే మిగిలిపోతున్నారు. పీఆర్సీ ప్రకటన వచ్చే వరకు విశ్రమించేది లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో రెండు వర్గాలుగా విడిపోయిన ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమం చేపడతామనే ఉపాధ్యాయులు ప్రకటిస్తున్నారు. దీంతో ఉపాధ్యాయుల తీరుపై నిరసనలు వ్యక్తమవుతున్నా పట్టించుకోవడం లేదు.
ప్రభుత్వం దిగి రావాల్సిందే. తమ డిమాండ్లు నెరవేర్చాల్సిందేనని ఉపాధ్యాయులు తెగేసి చెబుతున్నారు. తెరవెనుక రాజకీయ శక్తులు ఉండి ప్రోత్సహిస్తున్నారనే వాదన వస్తోంది. దీంతో ఉపాధ్యాయుల సమస్యలు తీర్చాల్సిందేనని డిమాండ్ తెస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.