https://oktelugu.com/

Narendra Modi – Kavitha : కేసీఆర్ కుమార్తె కవితపై మోడీ హాట్ కామెంట్స్

తెలంగాణ సీఎం కుమార్తె కవిత బాగుపడాలంటే మీ ఓటు బీఆర్ఎస్ కు వేయాలని.. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే మాత్రం ఓటు బీజేపీకి వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Written By:
  • NARESH
  • , Updated On : June 27, 2023 / 06:38 PM IST
    Follow us on

    Narendra Modi : తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంపై ప్రధాని మోడీ సంచలన కామెంట్స్ చేశారు. కుటుంబ పాలనపై తనదైన రీతిలో అటాక్ చేశారు. భోపాల్ లో జరిగిన కీలక భేటీలో ప్రధాని పదునైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కుమార్తె కవిత బాగుపడాలంటే మీ ఓటు బీఆర్ఎస్ కు వేయాలని.. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే మాత్రం ఓటు బీజేపీకి వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అక్కడ బీఆర్ఎస్ కు ఏమాత్రం సంబంధం లేకపోయినప్పటికీ మోడీ ప్రత్యేకంగా కేసీఆర్ కుటుంబాన్ని ప్రస్తావించడం విశేషం. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

    ఇటీవల తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు రాజకీయ అయోమయానికి దారితీస్తున్నాయి. తెలంగాణలో పాగా వేయాలన్నది బీజేపీ ప్లాన్. గత నాలుగేళ్లుగా ఇదే ప్రయత్నంలో ఉంది. ఇతర పార్టీ నాయకులను సైతం చేర్చుకుంటూ వస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరి పోరు నడుస్తూ వస్తోంది. అయితే అనూహ్యంగా కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. బీజేపీ చతికిలపడింది. తెలంగాణలో సైతం అదే పరిస్థితి ఎదురవుతుందన్న వార్తలు బీజేపీని కలవరపెడుతున్నాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపొందితే మాత్రం ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశముంది. అందుకే ఇక్కడ మరోసారి కేసీఆర్ గెలిచినా పర్వాలేదన్న నిర్ణయానికి బీజేపీ వచ్చినట్టు టాక్ నడుస్తోంది.

    ఢిల్లీ మద్యం కేసులో కేసీఆర్ కుమార్తె కవిత పేరు బయటకు వచ్చింది. ఆమె సీబీఐ విచారణను సైతం ఎదుర్కొన్నారు. ఆమె అరెస్టు తప్పదని అంతా భావించారు. రాష్ట్ర బీజేపీ నాయకులు సైతం అదే ఆశాభావంతో ఉన్నారు. కానీ అటువంటిదేమీ జరగకపోగా కేసీఆర్ తో బీజేపీ హైకమాండ్ రాజీకి వచ్చినట్టు వార్తలు వచ్చాయి. దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు డీలాపడిపోయారు. కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి చేరికలు సైతం ప్రారంభమయ్యాయి. ఒకరిద్దరు బీజేపీ పెద్ద నేతల పేర్లు సైతం వినిపించాయి.

    అటు రాష్ట్ర బీజేపీ నేతలు సైతం హైకమాండ్ వైఖరిపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు వార్తలు వచ్చాయి. సరిగ్గా ఈ సమయంలో భోపాల్ లో జరిగిన బీజేపీ క్రియాశీలక కార్యకర్తల శిబిరంలో ప్రధాని మోడీ కేసీఆర్ కుటుంబంపై వ్యాఖ్యలు చేయడం విశేషం. బీఆర్ఎస్ తో రాజీపడ్డారన్న ప్రచారంలో తెలంగాణలో బీజేపీకి భారీ డ్యామేజ్ జరిగింది. దాన్ని తగ్గించుకునేందుకే మోడీ ఇటువంటి కామెంట్స్ చేయాల్సి వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.