Deepika Pilli: చిలిపి చూపులతో రెచ్చగొడుతున్న యంగ్ యాంకర్ దీపికా పిల్లి… కుర్రాళ్లకు చెమటలు పట్టించే స్మైల్

సుడిగాలి సుధీర్ యాంకర్ రష్మీతో రొమాన్స్ చేసేవాడు. ఇక హైపర్ ఆదితో దీపికా పిల్లి సెటిల్ అయ్యింది. ఈ రెండు జంటలు సీజన్ 13కి అట్రాక్షన్ గా నిలిచారు. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచారు. అనూహ్యంగా సీజన్ 14 నుండి దీపికను తప్పించారు. రష్మీ, సుడిగాలి సుధీర్ లను కూడా పక్కన పెట్టారు. అది దీపికా పిల్లికి మైనస్ గా మారింది. అయితే ఆమెకు ఓటీటీ షోలలో యాంకర్ గా చేసే అవకాశం దక్కింది. ఆహాలో ప్రసారమైన కొన్ని షోలకు దీపిక యాంకర్ గా చేసింది.

Written By: Shiva, Updated On : June 28, 2023 10:27 am

Deepika Pilli

Follow us on

Deepika Pilli: యంగ్ యాంకర్ దీపికా లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. దీపికా పిల్లి సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యింది. ఈమెకు టిక్ టాక్ లో మిలియన్స్ కొద్దీ ఫాలోవర్స్ ఉండేవారు. అయితే టిక్ టాక్ బ్యాన్ చేయడంతో పెద్ద చిక్కొచ్చిపడింది. అయితే ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంది. సోషల్ మీడియా స్టార్ గా అవతరించిన దీపికా పిల్లికి ఢీ షోలో ఛాన్స్ దక్కింది. ఢీ సీజన్ 13 యాంకర్ గా దీపికా పిల్లి చేశారు. రష్మీ గౌతమ్, దీపికా పిల్లి గ్లామర్ ఆ సీజన్ కి హైలెట్ అయ్యింది.

సుడిగాలి సుధీర్ యాంకర్ రష్మీతో రొమాన్స్ చేసేవాడు. ఇక హైపర్ ఆదితో దీపికా పిల్లి సెటిల్ అయ్యింది. ఈ రెండు జంటలు సీజన్ 13కి అట్రాక్షన్ గా నిలిచారు. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచారు. అనూహ్యంగా సీజన్ 14 నుండి దీపికను తప్పించారు. రష్మీ, సుడిగాలి సుధీర్ లను కూడా పక్కన పెట్టారు. అది దీపికా పిల్లికి మైనస్ గా మారింది. అయితే ఆమెకు ఓటీటీ షోలలో యాంకర్ గా చేసే అవకాశం దక్కింది. ఆహాలో ప్రసారమైన కొన్ని షోలకు దీపిక యాంకర్ గా చేసింది.

దీపికకు సినిమా ఆఫర్ రావడం మరొక విశేషం. వాంటెడ్ పండుగాడ్ టైటిల్ తో తెరకెక్కిన చిత్రంలో దీపికా పిల్లి ఒక రోల్ చేసింది. అనసూయ, సునీల్, వెన్నెల కిషోర్ తో పాటు పలువురు స్టార్ కమెడియన్స్ ఈ చిత్రంలో నటించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కిన వాంటెడ్ పండుగాడ్ చెత్త మూవీగా పేరు తెచ్చకుంది. ఆ చిత్రం డిజాస్టర్ కావడం దీపిక నిరాశకు గురైంది.

అయితే ఢీ లేటెస్ట్ సీజన్లో దీపికా పిల్లికి ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. ఇటీవల ప్రోమో విడుదల కాగా దీపికా పిల్లి సైతం సందడి చేశారు. అదే జరిగితే దీపిక పిల్లి మంచి ఛాన్స్ కొట్టేసినట్లే. ఢీ టాప్ రేటెడ్ షోగా ఉన్న క్రమంలో ఆమెకు మరికొంత ఫేమ్ దక్కుతుంది. వెండితెర, బుల్లితెర ఆఫర్స్ సంగతి ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. దీపికా పిల్లి లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.