https://oktelugu.com/

PM Narendra Modi: ఎల్లుండి నుంచి అందరి ప్రొఫైల్ పిక్ అదే ఉండాలి!

PM Narendra Modi: దేశానికి స్వాతంత్య్రం  వచ్చి 75 ఏళ్లు పూర్తి కావస్తోంది. ఈ ఆగస్టు 15కు 75 ఏళ్ల భారతం మన కళ్లముందు కదలాడుతోంది. అందుకే ఈ ప్రతిష్టాత్మక సంవత్సరాన్ని కేంద్రంలోని మోడీ సర్కార్ ఘనంగా నిర్వహించేందుకు ఏడాది నుంచి ప్లాన్లు చేస్తోంది. ఇప్పటికే ‘ఆజాదీ’ ఉత్సవాల పేరిట కేంద్రప్రభుత్వం నిర్వహిస్తోంది.] ఇటీవల ప్రధాని మోడీ దేశంలోని ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మన్ కీ బాత్ లో […]

Written By:
  • NARESH
  • , Updated On : July 31, 2022 2:33 pm
    Follow us on

    PM Narendra Modi: దేశానికి స్వాతంత్య్రం  వచ్చి 75 ఏళ్లు పూర్తి కావస్తోంది. ఈ ఆగస్టు 15కు 75 ఏళ్ల భారతం మన కళ్లముందు కదలాడుతోంది. అందుకే ఈ ప్రతిష్టాత్మక సంవత్సరాన్ని కేంద్రంలోని మోడీ సర్కార్ ఘనంగా నిర్వహించేందుకు ఏడాది నుంచి ప్లాన్లు చేస్తోంది. ఇప్పటికే ‘ఆజాదీ’ ఉత్సవాల పేరిట కేంద్రప్రభుత్వం నిర్వహిస్తోంది.]

    ఇటీవల ప్రధాని మోడీ దేశంలోని ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మన్ కీ బాత్ లో మాట్లాడిన మోడీ.. ఆగస్టు 2-15 వరకూ దేశ పౌరులంతా తమ సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్ గా జాతీయ జెండాను పెట్టుకోవాలని కోరారు. ఇది సమానత్వానికి సూచిక అని మోడీ సూచించారు.

    దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తికానున్న నేపథ్యంలో ఈసారి ఆగస్టు 15 వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఆగస్టు 13-15 మధ్య ఇంటింటా జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాని మోడీ కోరారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు.

    ఇక కర్ణాటకలో ‘అమృత భారతి కన్నడర్తి’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా 75 ప్రదేశాల్లో స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించినట్లు వెల్లడించారు. స్వాతంత్ర్య పోరాటంలో రైల్వేల ప్రాముఖ్యతను వివరిస్తూ ‘ఆజాదీ కా రైల్ గాడీ’ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ప్రధాని పేర్కొన్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 75 రైల్వే స్టేషన్లను సర్వాంగ సంుదరంగా తీర్చిదిద్దినట్లు వెల్లడించారు.

    మువ్వెన్నల జెండాను రూపొందించిన ఆంధ్రాకు చెందిన పింగలి వెంకయ్య జయంతి సందర్భంగా మోడీ గుర్తు చేసుకున్నారు. స్వాతంత్ర్య పోరాటంలోని వారందరికీ నివాళులర్పించారు.