కరోనా వేళ.. మోదీ సప్తపది..

దేశంలో కరోనా ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తోంది. నేటితో కేంద్రం విధించిన 21రోజుల లాక్డౌన్ ముగుస్తుండటంతో ప్రధాని మోదీ నేడు ఉదయం 10గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో కరోనా పరిస్థితులు, లాక్డౌన్ పరిస్థితులపై మాట్లాడారు. మోదీ ప్రసంగం చూసినట్లయితే దేశ ప్రజల ప్రాణాలే ముఖ్యమని స్పష్టం చేశారు. లాక్డౌన్ అమలుతో ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతున్నప్పటికీ లాక్డౌన్ అమలుకే ఆయన మొగ్గుచూపారు. దేశంలో లాక్డౌన్ మే3వరకు కొనసాగుతుందని మోదీ స్పష్టం చేశారు. అంటే మరో […]

Written By: Neelambaram, Updated On : April 14, 2020 11:49 am
Follow us on


దేశంలో కరోనా ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తోంది. నేటితో కేంద్రం విధించిన 21రోజుల లాక్డౌన్ ముగుస్తుండటంతో ప్రధాని మోదీ నేడు ఉదయం 10గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో కరోనా పరిస్థితులు, లాక్డౌన్ పరిస్థితులపై మాట్లాడారు. మోదీ ప్రసంగం చూసినట్లయితే దేశ ప్రజల ప్రాణాలే ముఖ్యమని స్పష్టం చేశారు. లాక్డౌన్ అమలుతో ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతున్నప్పటికీ లాక్డౌన్ అమలుకే ఆయన మొగ్గుచూపారు. దేశంలో లాక్డౌన్ మే3వరకు కొనసాగుతుందని మోదీ స్పష్టం చేశారు. అంటే మరో 19రోజులపాటు లాక్డౌన్ అమలు కొనసాగనుంది.

దేశంలో కరోనా కట్టడి వచ్చే వారం రోజులు చాలా కీలకమని ఆయన తెలిపారు. ఏప్రిల్ 20వరకు లాక్డౌన్ అమలును మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 20తర్వాత దేశంలో కరోనా పరిస్థితులను చూసి అవసరమైతే దేశంలో కొన్ని సడలింపులు ఇస్తామని ఆయన చెప్పారు. ప్రపంచంలోని చాలా దేశాలతో పోలిస్తే భారత్ కరోనా వైరస్ ను చాలా వరకు కట్టడి చేసిందన్నారు. కరోనా విషయంలో భారత్ ముందే మేల్కొందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కట్టడి చేసేందుకు లాక్డౌన్ కొనసాగింపు ముఖ్యమని తెలిపారు. ముఖ్యమంత్రులు, వైద్యాధికారులు సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

కరోనా కట్టడికి మోదీ సప్తపది..
1. వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారిపట్ల ప్రత్యేక శద్ధ చూపించాలి.
2. లాక్ డౌన్, సామాజిక దూరం పాటించాలి. మాస్కులను ధరించాలి
3. ప్రతీఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి.
4. ఆరోగ్య సేతు మొబైల్ యాప్ డౌన్ చేసుకొండి. కేంద్రం మార్గదర్మకాలను పాటించాలి.
5. పేదలకు, అన్నర్థులకు మరింత సేవ చేయాలి.
6. ఏ ప్రైవేట్ సంస్థ కూడా ఉద్యోగులను తొలగించొద్దు.
7. మెడికల్ సిబ్బంది, పోలీస్, శానిటైజ‌ర్ సిబ్బందిని గౌరవించాలి.