MLC Kavitha: ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవాలని పెద్దలు చెబుతారు నిజామాబాద్ మాజీ ఎంపీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మరోమారు అక్కడే తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఆమె మళ్లీ నిజామాబాద్ లోనే తిరుగుతూ ఎంపీ అరవింద్ పై విమర్శలు చేస్తన్నారు. రైతులను మోసం చేసి గద్దెనెక్కిన అరవింద్ ఇప్పుడు ఎవరిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

పసుపు రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం వారిని పట్టించుకోవడం లేదు. తాను నిజామాబాద్ ఎంపీ బరిలో నిలవబోతున్నట్లు కవిత సంకేతాలు ఇస్తున్నారు. దీని కోసం రైతుల పక్షాన నిలబడి పోరాడేందుకు సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని రైతులకు బాండ్ రాసిచ్చి ఇప్పుడు తప్పించుకుతిరుగుతున్న అరవింద్ ను అడ్డుకుంటామని పేర్కొన్నారు.
Also Read: Nadda Visit Telangana: తెలంగాణ బీజేపీ విన్నింగ్ ప్లాన్ రెడీ చేస్తున్న నడ్డా? ఇలా ముందుకు.?
పసుపు బోర్డు కోసం తాను ప్రధానమంత్రిని కలిసి విన్నవించినట్లు చెబుతున్నారు.పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని కోరామని కానీ ఎంపీ అరవింద్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటున్నాడని ప్రజల కష్టాలు లెక్కలోకి తీసుకోవడం లేదు. రైతుల పక్షాన పోరాడతామని చెప్పిఎన్నికల్లో గెలిచినా వారి ఊసే ఎత్తడం లేదని తెలుస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీ అరవింద్ రైతుల కోసం చేస్తుందేమీ లేదు. దీంతో వారి సమస్యలు తీరడం లేదు. కవిత ఇకపై రైతులతో కలిసి పోరాటం చేసి వారికి పసుపు ఏర్పాటు చేసే వరకు ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో రాణిస్తున్న కవిత నిజామాబాద్ పైనే దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో ఇక్కడి నుంచే మళ్లీ పోటీలో ఉండాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎంపీ అరవింద్ కు పోటీ తప్పదనే భావం కనిపిస్తోంది.
నిజామాబాద్ లో ఇదివరకే కవితకు పరిచయాలు అక్కర్లేదు. దీంతో అక్కడి నుంచే పోటీకి దిగాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కవిత మరోమారు ఎంపీగా నిలబడి విజయం సాధించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
Also Read:AP Financial Crisis : దివాలా దిశగా ఏపీ.. రూ.20వేల కోట్ల చెల్లించలేక చేతులెత్తేసిందే?
[…] […]