Vasantha Krishna Prasad-Jagan: ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎవరో పెట్టిన పోస్టులకు మరెవరో బాధ్యులు అవుతున్నారు. ఫలితంగా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఓ వార్త సంచలనం అవుతోంది. దీనికి ఓ ఎమ్మెల్యే తల పట్టుకుంటున్నారు. జరిగిన తతంగానికి మనస్తాపానికి గురవుతున్నారు. కానీ పోస్టు చేసిన వ్యక్తి పరాయి రాష్ర్టం వాడు కావడంతో ఏం చేయలేని పరిస్థితి. ఈ క్రమంలో సోషల్ మీడియా ప్రభావం ఎంత దుమారం రేపుతోందో తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ను ముఖ్యమంత్రి జగన్ కొట్టాడని సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో హల్ చల్ చేసింది. దీంతో ఆయన పరువు పోయింది. దీన్ని నుంచి తప్పించుకోవాలంటే ఎలా అని ఆలోచించారు. ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తే విషయం కాస్త మరింత పెద్దగా అయిపోతుందని భావించారు. మరి ఎలా డీల్ చేయాలని మథనపడిపోయారు. దీనికి కారకులను గుర్తించే పనిలో పడ్డారు.తన ప్రతిష్టకు భంగం కలిగించే వాడిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
దీంతో అతడిపై కేసు పెట్టేందుకు నిశ్చయించుకున్నారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి సదరు నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కానీ అతడిది ఖమ్మం జిల్లా తెలుగు యువత నాయకుడిగా గుర్తించడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది. ఖమ్మం జిల్లా పక్క రాష్ర్టం కావడంతో అక్కడికి వెళ్లేందుకు చిక్కులు ఉంటాయని భావించి వారు సిద్ధపడటం లేదు. దీంతో ఆ ఎమ్మెల్యే ఆందోళనలో పడిపోయారు. తనకు జరిగిన అవమానంపై కుంగిపోతున్నారు.
Also Read: అలీకి జగన్ ఇవ్వబోతున్న పదవి అదేనట ?
సామాజిక మాధ్యమాలతో ఎన్ని చిక్కులు వస్తున్నాయో తెలుస్తోంది. అనవసర విషయాలకు ప్రాధాన్యం పెరిగి బాధితులకు పెనుభారంగా మారుతోంది. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు. ఎవరో చేసిన దానికి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తోంది. దీంతో ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లుగా తలవంపులు వస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Also Read: చిరంజీవి, మహేష్, ప్రభాస్.. ఆఖరుకు బామ్మర్ధి విష్ణు వచ్చినా కరగవా జగన్?