spot_img
Homeఆంధ్రప్రదేశ్‌MLA Roja: జబర్ధస్త్ నుంచి ఔట్.. రోజాకు మంత్రి పదవి ఖాయమైందా?

MLA Roja: జబర్ధస్త్ నుంచి ఔట్.. రోజాకు మంత్రి పదవి ఖాయమైందా?

MLA Roja: సినీ నటి రోజా.. జబర్దస్త్‌ జడ్జి రోజా.. ఎమ్యెల్యే రోజా.. ఇవన్నీ చాలా రొటీన్ పిలుపులే. అయితే మినిస్టర్‌ రోజా అంటే ఆ సౌండ్‌లో కొంత బేస్‌ ఉంది.. రిచ్‌నెస్‌ ఉంది.. త్వరలో రోజా మంత్రి కాబోతుందా? అంటే.. ఎవరూ స్పష్టత ఇవ్వడం లేదు. రోజాకు మంత్రి పదవి వస్తే.. ఆటోమేటిక్‌గా జబర్దస్త్‌కు కొత్త జడ్జి కూడా వస్తారు. ఇప్పటికే ఎమ్మెల్యే అయిన రోజా జబర్దస్త్‌ షో చేయడంపై ప్రతిపక్ష టీడీపీ విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవి వస్తే జబర్దస్ట్‌ నుంచి తప్పుకోవాలని రోజా భావిస్తున్నారు. దీంతో కొత్త జడ్జి కోసం జబర్దస్త్‌ నిర్మాతలు అన్వేషణ కూడా మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కొంతమంది మాత్రం జబర్దస్త్‌కి కొత్త జడ్జీ వస్తే రోజాకి మంత్రి పదవి వచ్చినట్టు ఫిక్స్‌ అయిపోవడమేనా? ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా ఇది కూడా కావచ్చు అని వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే దానీకి ఓ కారణం చెబుతున్నారు. అన్న వస్తున్నాడు అంటూ ఏపీలో జగన్‌ జెండా పాతేసిన తరువాత వైసీపీ ఫైర్‌ బ్రాండ్‌గా ఉన్న ఎమ్మెల్యే రోజాకి మంత్రి పదవి వస్తుందని అనుకున్నారంతా.. అయితే తొలి మంత్రి వర్గ విస్తరణలో రోజాకి చోటు దక్కలేదు. మరి ఈ విడత చాన్స్‌ దక్కుతుందా లేదో మరికొన్ని గంటల్లో స్పష్టత వస్తుంది.

MLA Roja
MLA Roja

Also Read: CM KCR- Governor Tamilisai: ఢిల్లీకి చేరిన సీఎం, గవర్నర్ పంచాయితీ?

-పదవిపై రోజా ఫోకస్‌..

నగరి ఎమ్మెల్యే రోజా కొన్ని రోజులుగా మంత్రిపదవిపై దృష్టిపెట్టారు. మొదటిసారే మిస్‌ అయింది.. ఈసారి మిస్‌ కావొద్దు అన్నట్లుగా తనకున్న ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కొన్ని రోజులుగా.. సినిమాలు, కామెడీ షోలు, జబర్దస్త్‌లు, పండగ ఈవెంట్‌లపై ఫోకస్‌ తగ్గించారు. తాజాగా జబర్దస్త్‌ నుంచి మాయం అయ్యారు. జబర్దస్త్‌ ప్రోమోలో రోజా ప్లేస్‌ని నిర్వాహకులు ఇంద్రజతో రీప్లేస్‌ చేసేశారు కూడా. దీంతో రోజా మేడమ్‌కి గారికి మంత్రి పదవి కన్ఫామ్‌ అయినట్టే అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం కూడా జరిగింది.

-మినిస్టర్‌ రోజా…

రోజా రాజకీయాల్లో ఉండి.. ఎమ్మెల్యే గెలిచి.. జబర్దస్త్‌ షో చేయడం ద్వారా ట్రోలింగ్‌ బారిన పడుతూనే ఉంది. ఒక రకంగా ఆమె పొలిటికల్‌ ఇమేజ్‌కి జబర్దస్త్‌ డ్యామేజ్‌ చేస్తున్నప్పటికీ ఎమ్మెల్యే అంటే ఈరోజు ఉండొచ్చు.. రేపు పోవచ్చు.. కానీ జబర్దస్త్‌ అలా కాదు కదా.. ఎన్నేళ్లైనా అన్నట్టుగా బ్రాండ్ క్రియేట్‌ అయ్యింది. దీంతో రోజా ఎన్ని విమర్శలు వచ్చినా జబర్దస్త్‌ని వీడలేదు. అయితే ఇప్పుడు మంత్రి పదవా? జబర్దస్తా అంటే మాత్రం ఆమె మంత్రి పదవి వైపు మొగ్గుచూపించే అవకాశమే ఎక్కువ ఉంది. ఎంతైనా ఎమ్మెల్యే రోజా అనే సౌండ్‌లో ఉన్న బేస్‌ కంటే.. మినిస్టర్‌ రోజా అనే సౌండ్‌లోనే బేస్‌ ఎక్కువ. పైగా ఎవరికి మాత్రం ఉండదు మంత్రివర్యులు అనిపించుకోవాలని. అందుకే జబర్దస్త్‌ క్విట్‌.. మినిస్టర్‌ ఫిట్‌ అనేసిందనే టాక్‌ నడుస్తోంది.

-మంత్రి పదవి ఈజీ కాదు..

MLA Roja
MLA Roja

రోజాకి మంత్రి పదవి రావడం అనేది అంత ఈజీ అయితే కాదు.. ఎందుకంటే.. ప్రస్తుతం ఏపీ కేబినెట్‌లో ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారు. మేకతోటి సుచరిత, పాముల పుష్ప శ్రీవాణి, తానేటి వనిత.. ఈ ముగ్గుర్నీ అలాగే ఉంచి కొత్తగా మరో మహిళకు మంత్రి పదవి ఇవ్వాలంటే కష్టమే. వీళ్లలో ఒకరిద్దర్ని తప్పిస్తే మాత్రం రోజాకి లైన్‌ క్లియర్‌ అయ్యిందంటే పొరపాటే.

– చిత్తూరు జిల్లావారిగా చూసినా కూడా రోజాకి అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కె.నారాయణస్వామి మంత్రులుగా కొనసాగుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో రోజాకి పడదు.. ఇద్దరి మధ్య రాజకీయ వైరం ఉంది. దీంతోపాటు జూనియర్స్, సీనియర్స్‌ నుంచి కూడా గట్టిపోటీ ఉంది. సీనియర్‌ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి మంత్రి పదవి కోసం రోజాకి గట్టి పోటీ ఇస్తున్నారు. వారితోపాటు జూనియర్లు శ్రీనివాసులు, ద్వారకనాధరెడ్డి కూడా ఎవరి ప్రయత్నం వాళ్లు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోజా మంత్రి పదవి దక్కించుకుంది అంటే అంతకు మించిన విజయం మరోటి ఉండదు. పైగా ఎన్నికల ముందు మంత్రి అయితే.. వచ్చే ఎన్నికల్లో ఆర్థికంగా కూడా బలం చేకూరినట్టే. మంత్రి రోజానా? లేదంటే జబర్దస్త్‌ జడ్జీనా అన్నది కొన్ని గంటల్లో తేలిపోనుంది. రోజా మంత్రి అవుతారా లేదా అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also Read:AP Cabinet Reshuffle: కొత్త మంత్రివర్గంపై జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారా?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper