https://oktelugu.com/

రేవంత్ రెడ్డా? కోవర్ట్ రెడ్డా.. నిప్పులు చెరిగిన రోజా

ఎప్పుడు వార్తల్లో నిలిచే రోజా ఈ మధ్య కాస్త తగ్గించారు. ఒకప్పుడు నిత్యం వార్తల్లోనే కనిపించే రోజా ఇటీవల కాలంలో కాస్త నెమ్మదించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ల మధ్య కొనసాగుతున్న జల వివాదం నేపథ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ చేసిన వ్యాఖ్యలపై రోజా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు, లోకేష్, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రైతులను దగా చేసిన పార్టీ టీడీపీయే నని ఆగ్రహం వ్యక్తం […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 9, 2021 6:58 pm
    Follow us on

    Rojaఎప్పుడు వార్తల్లో నిలిచే రోజా ఈ మధ్య కాస్త తగ్గించారు. ఒకప్పుడు నిత్యం వార్తల్లోనే కనిపించే రోజా ఇటీవల కాలంలో కాస్త నెమ్మదించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ల మధ్య కొనసాగుతున్న జల వివాదం నేపథ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ చేసిన వ్యాఖ్యలపై రోజా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు, లోకేష్, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

    రైతులను దగా చేసిన పార్టీ టీడీపీయే నని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి రైతుల కోసం అహర్నిశలు శ్రమించారని కొనియాడారు. ఇప్పుడు సీఎం జగన్ కూడా ఆయన బాటలోనే రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు. రూ.83 వేల కోట్లతో రైతులకు వివిద పథకాలు అందిస్తున్నారని తెలిపారు.

    చంద్రబాబు హయాంలో రైతులకు మంచి విత్తనాలు దొరకని పరిస్థితి ఉండేదన్నారు. కానీ ఇప్పుడు నకిలీవిత్తనాల ఊసే లేకుండా పోయిందన్నారు. రైతు ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో జల వివాదాలే లేవని లోకేష్ చెప్పడం దారుణమన్నారు. దేవినేని ఉమ, హరీశ్ రావు, తెలంగాణ, ఆంధ్ర పోలీసులు కొట్టుకున్న సందర్భాన్ని లోకేష్ మరిచిపోయారని గుర్తు చేశారు. పది సంవత్సరాల ఉమ్మడి రాజధాని లో ఉండాల్సింది పోయి దొంగలాగా విజయవాడలో వదిలేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.

    పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కూడా విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డా? కోవర్ట్ రెడ్డా అని హేళన చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మా ఇంటికి ఎప్పుడు రాలేదని గుర్తు చేశారు. దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. ఒకసారి కేసీఆర్ తమిళనాడు వెళుతూ మార్గమధ్యలో ఉన్న మా ఇంటికి వచ్చారన్నారు. కానీ మా ఇంట్లో ఎలాంటి సమావేశం జరగలేదని సూచించారు. రేవంత్ రెడ్డి ఎవరి మెప్పు కోసం ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారో తెలియడం లేదని చెప్పారు.

    బీజేపీ నేతలు కూడా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాస్ర్ట ప్రయోజనాలు కాపాడాల్సింది పోయి తప్పుదోవ పట్టించేలా ఉండకూడదని హితవు పలికారు. జలవివాదాలపై సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు. రాష్ర్ట విబజన హక్కులు కాపాడాల్సిన బాధ్యతలు కేంద్రానికి ఉన్నాయని స్పష్టం చేశారు.