https://oktelugu.com/

రైతులకు వైసీపీ ఎమ్మెల్యే కోటి సాయం.. జగన్ సర్కార్ పరువు పాయే..

ఎలాంటి పరిస్థితుల్లో అయినా.. ప్రజలను ఆపదలో ఆదుకునే వాడే నాయకుడు. ఇటీవల నివర్‌‌ తుఫాను ఏపీలో రైతులను కకావికలం చేసింది. భారీ ఎత్తున పంట నష్టం వాటిల్లింది. దీంతో అప్పటి నుంచి రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా నివర్ తుపాను దెబ్బకు కడప జిల్లాలోనూ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రొద్దుటూరులోనూ అంతే. రైతులు తీవ్రంగా నష్టపోవడం చూసి చలించిపోయిన ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి తన సొంత డబ్బును కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించారు. […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 22, 2020 / 12:54 PM IST
    Follow us on


    ఎలాంటి పరిస్థితుల్లో అయినా.. ప్రజలను ఆపదలో ఆదుకునే వాడే నాయకుడు. ఇటీవల నివర్‌‌ తుఫాను ఏపీలో రైతులను కకావికలం చేసింది. భారీ ఎత్తున పంట నష్టం వాటిల్లింది. దీంతో అప్పటి నుంచి రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా నివర్ తుపాను దెబ్బకు కడప జిల్లాలోనూ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రొద్దుటూరులోనూ అంతే. రైతులు తీవ్రంగా నష్టపోవడం చూసి చలించిపోయిన ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి తన సొంత డబ్బును కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించారు.

    Also Read: సొంత నియోజకవర్గంపై జగన్‌ ప్రేమ

    ప్రసాదరెడ్డి అందరి లాంటి రాజకీయ నాయకుడు కాదు. ఎలా సంపాదించినా సరే.. రూ. కోటిని రైతులకు పంపిణీ చేసేశారు. ప్రత్యేకంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి నష్టపోయిన రైతులకు సాయం అందించాడు. రాచమల్లు ప్రసాదరెడ్డి ఔదార్యం రైతులకు నచ్చింది కానీ.. వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదు. ప్రసాదరెడ్డి నిర్ణయంతో జిల్లాలోని ఇతర నియోజకవర్గాల రైతులు.. వైసీపీ ఎమ్మెల్యేల వైపు ఆశగా చూస్తున్నారు.

    ఎందుకంటే.. ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వడం లేదు. ఇన్‌పుట్ సబ్సిడీ మాత్రం ఇస్తామని చెప్పింది. ఆ మొత్తం రూ.700 కోట్లకు అటూఇటుగా అంతే. రైతులు నష్టపోయిన పంట విలువ రూ.15 వేల కోట్ల వరకూ ఉంటుందని అధికార వర్గాల అంచనా. కేంద్రానికి పంపే నివేదికల్లోనూ దాదాపుగా ఇంతేమొత్తం ఉంది. అంత భారీ నష్టం జరిగితే.. రూ.700 కోట్లు మాత్రమే ఇన్‌పుట్ సబ్సిడీగా ప్రకటిస్తే.. ఒక్కో రైతులు రూ.వెయ్యి అయినా అందడం కష్టమే. అందుకే.. ప్రభుత్వం ఎలాగూ సాయం చేయదు కాబట్టి.. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రసాదరెడ్డిలా సాయం చేయాలని కోరుకుంటున్నారు.

    Also Read: టీడీపీ రెచ్చగొట్టే రాజకీయాలు.. ఉచ్చులో పడని వైసీపీ

    ఒక్క కడప జిల్లాలోనే కాదు.. రాయలసీమతోపాటు గోదావరి జిల్లాల వరకూ నివర్ తుపాన్ ప్రభావం భారీగా కనిపించింది. గోదావరి జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున పంట నష్టపోయారు. వీరందరినీ ఆదుకోవాలని అన్ని పార్టీలూ డిమాండ్ చేస్తున్నాయి. రైతులకు ఎకరానికి రూ.30 వేలు ఇవ్వాలని టీడీపీ, జనసేనలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. కానీ.. ప్రభుత్వం మాత్రం నిజాయితీగా పంట నష్టం వేశామని చెబుతూ ఇన్‌పుట్ సబ్సిడీని మాత్రమే ఇస్తామని చెప్పింది. అయితే ప్రభుత్వ నిజాయితీ కన్నా… వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరెడ్డి నిజాయితీ ఎక్కువగా ఉన్నట్లుగా తాజాగా తేలింది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్