MLA Jagga Reddy Resign: కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా మారిన విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో నేతల్లో అభిప్రాయ భేదాలు తలెత్తుతున్నాయి. మొదటినుంచి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారే ఎక్కువగా ఉండటంతో పార్టీ ముందుకు వెళ్లలేకపోతోంది. ఏ పని చేసినా సీనియర్లు సాయం చేయకపోవడంతోపార్టీ భవిష్యత్ అగమ్యగోచరంగా మారనుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరిన్ని సమస్యలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
పార్టీ సీనియర్ నేతగా ఉన్న ఎమ్మెల్యే జయప్రకాశ్ రెడ్డి రాజీనామా చేస్తున్నారనే ఊహాగానాఉ వెలువడుతున్నాయి. దీంతో కాంగ్రెస్ కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు ఇద్దరి మధ్య రగులుతున్న విభేదాలతోనే తాను పార్టీని వీడనున్నట్లు జయప్రకాశ్ చెప్పడం గమనార్హం. తనను టీఆర్ఎస్ కోవర్టుగా రేవంత్ రెడ్డి వర్గం చూస్తోందని సామాజిక మాధ్యమాల్లో తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కూడా కేసీఆర్ నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమం విషయమై కూడా ఆయనతో సంప్రదించకుండానే నిర్ణయం తీసుకోవడంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదరడం లేదు. దీంతోనే అప్పటి నుంచి ఎడం పెరిగిపోయింది. ఇప్పుడు రాజీనామా చేసే వరకు వెళ్లింది. కాంగ్రెస్ పార్టీకి ఇక కష్టాలు ఇంకా పెరిగినట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరు ఇలా పార్టీని వీడుతుంటే రాబోయే రోజుల్లో పార్టీ మనుగడ కష్టమే అని భావిస్తున్నారు.
Also Read: పేరు లేదనే అలకబూనిన కేసీఆర్ః వివరణ ఇచ్చిన జీయర్ స్వామి
కాంగ్రెస్ అధిష్టానం కూడా పార్టీ ఎదుగుదలై పట్టించుకోవడం లేదు. దీంతోనే పలు రాష్ట్రాల్లో పార్టీకి పవర్ లేకుండా పోతోంది. అధికారం దూరం కావడంతో మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశం కూడా వారిలో కనిపించడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతల్లో సమన్వయం కొరవడుతుందని తెలుస్తోంది. అందుకే ఏ కార్యక్రమం తీసుకున్నా నేతలు మాత్రం హాజరు కావడం లేదు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి తీరును మెజార్టీ నేతలు తప్పుబడుతున్నట్లు తెలుస్తోంది.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే కరువు అవుతారనే వాదనలు కూడా వస్తున్నాయి. జయప్రకాశ్ రెడ్డి స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉండటానికే ఇష్టపడుతున్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం కూడా సాగుతోంది. ఏదిఏమైనా కాంగ్రెస్ పార్టీకి మరో దెబ్బ తగలడంతో ఇక కోలుకుంటుందా? మనుగడ సాగిస్తుందా అనే అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి.
Also Read: కేసీఆర్ తో విభేదాలపై స్పందించిన చినజీయర్ స్వామి.. హాట్ కామెంట్స్