Richa Chadha: సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఏ వార్త అయినా వారి అభిమానులకు చాలా ఇంట్రెస్టింగ్. అందుకే మీడియా నిత్యం వారిని కనిపెట్టుకుని ఉంటుంది. వారు చేసిన ఏ పనిని అయినా చాలా పెద్ద వార్త అన్నట్టు పబ్లిష్ చేస్తుంటాయి మీడియా సంస్థలు. ఇక వారు రోడ్డు మీదకు వచ్చి ఏదైనా పని చేశారంటే అదే పెద్ద వార్త లాగా అయిపోతుంటుంది. ఈ క్రమంలో కొందరు సినీ సెలబ్రిటీలు చేసే పనులు ప్రజలకు మేలు కూడా చేస్తుంటాయి.
ఇప్పుడు బాలీవుడ్ నటి రీచా చద్దా కూడా ఇలాంటి పాజిటివ్ కోణంలో ఆలోచించి ఓ పని చేసింది. అది కాస్తా నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది. దీనికి ఓ పెద్ద కారణమే ఉందండోయ్. మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలో స్వీపర్‌కు హగ్ ఇస్తాడు చిరు. అలా బాధలో ఉన్న వారికి ప్రేమగా ఒక కౌగిలింత ఇస్తే వారి బాధను మర్చిపోతారన్నది ఆ సీన్ కాన్సెప్ట్.
అయితే రీచా కూడా ఇదే ఫార్ములాను ఫాలో అయిపోయింది. ముంబై రోడ్ల మీద నిలబడి అందరికీ ఫ్రీగా హగ్గులు ఇస్తోంది. ఇలా తాను ప్రేమగా ఇచ్చే హగ్ తో ప్రజలు తమ బాధను కొంతైనా మర్చిపోయి పాజిటివ్ గా ఆలోచిస్తారన్నది ఆమె కాన్సెప్ట్. ఇందుకోసం ఫ్రీ హగ్ అనే క్యాంపెయిన్‌ను నిర్వహిస్తోంది రీచా. ఇందుకు సంబంధించిన వీడియోలు మీడియాలు, ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి. అయితే ఈ వీడియో రెండు సంవత్సాలక్రితంది అని తెలుస్తోంది… నిన్న మళ్లీ షేర్ చేయడంతో తాజాగా వైరల్ అయింది. పాత వీడియోల్లో హగ్గుల్లో ఇచ్చి అప్పుడూ గుర్తించనప్పటికీ ఇప్పుడు నెటిజన్లు ఆమె చేసిన పనికి ప్రశంసిస్తున్నారు.
Also Read: ఆ విషయంలో నేను సిగ్గుపడను – అనసూయ
అయితే ఇది చూసిన కొందరు ఆమెను ప్రశంసిస్తున్నారు. ఆమె చేస్తున్న పని వల్ల చాలామంది తమ ఒత్తిడిని మర్చిపోతారని అంటున్నారు. కానీ ఇంకొందరు మాత్రం.. ఈ కరోనా సమయంలో మాస్కు లేకుండా ఇలా అందరికీ హగ్గులు ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. ఒక నటి అయి ఉండి ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆమె వల్ల ఒకరి నుంచి మరొకరికి కరోనా వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. ఏదేమైనా రీచా చేసిన పని వల్ల కొందరు సంతోషిస్తే.. మరి కొందరు లాజిక్ తో విమర్శిస్తున్నారు. రెండు కరెక్టే అంటున్నారు సామాన్య జనం.
Also Read: ప్చ్.. 47 ఏళ్ల సినీ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ ప్లాప్