https://oktelugu.com/

k viswanath- chiranjeevi: లెజెండరీ డైరెక్టర్ కి మెగా శుభాకాంక్షలు – చిరంజీవి

k viswanath- chiranjeevi: లెజెండరీ డైరెక్టర్, సీనియర్ నటుడు కె.విశ్వనాథ్‌ కు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలుగు జాతి, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసి, తెలుగు సినిమా చరిత్ర శంకరాభరణం ముందు, శంకరాభరణం తర్వాత, అనేలా చేసిన మీరు తెలుగు వారందరికీ అందిన వరం! మీ దర్శకత్వంలో నటించడం నా అదృష్టం! మీరు కలకాలం ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా’ అని చిరంజీవి ట్విట్ట్ చేశారు. కె.విశ్వనాథ్‌ గారు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 19, 2022 / 11:39 AM IST
    Follow us on

    k viswanath- chiranjeevi: లెజెండరీ డైరెక్టర్, సీనియర్ నటుడు కె.విశ్వనాథ్‌ కు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలుగు జాతి, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసి, తెలుగు సినిమా చరిత్ర శంకరాభరణం ముందు, శంకరాభరణం తర్వాత, అనేలా చేసిన మీరు తెలుగు వారందరికీ అందిన వరం! మీ దర్శకత్వంలో నటించడం నా అదృష్టం! మీరు కలకాలం ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా’ అని చిరంజీవి ట్విట్ట్ చేశారు.

    k viswanath- chiranjeevi

    కె.విశ్వనాథ్‌ గారు ఈ రోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తమ అభిమాన దర్శకుడికి శుభాకాంక్షలు తెలియజేయడానికి అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా పోటీ పడ్డారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కె.విశ్వనాథ్‌ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ పై విధంగా ట్వీట్ చేశారు.

    Also Read:  ఆ హీరోయిన్ని కమిట్‌మెంట్ అడిగిన తెలుగు హీరోలు

    ఇక మెగాస్టార్ కి కె.విశ్వనాథ్‌ గారు అంటే ఎంతో గౌరవం. తెలుగు చిత్ర పరిశ్రమకు కె.విశ్వనాథ్‌ గారు ఎంతో సేవ చేసి తనదైన ప్రత్యేక ముద్ర వేశారని చిరు చెప్పుకొచ్చారు. కె.విశ్వనాథ్‌ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆహ్లాదంగా ఉండాలని శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.

    k viswanath- chiranjeevi

    ఇక తెలుగు ప్రేక్షకులు కూడా కె.విశ్వనాథ్‌ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో రకరకాల మెసేజ్ లు పోస్ట్ చేశారు. మరి వారి శుభాకాంక్షలు ఎలా ఉన్నాయో చూద్దామా. ‘మంచి సుగుణాలన్నీ ఉన్న దర్శక కళాతపస్వికి హ్యాపీ బర్త్‌ డే. మీరు ఒక్క మా తరానికే కాదు. రానున్న భవిష్యత్తు తరాలకు కూడా ఇన్స్పిరేషన్ అంటూ విషెస్ తెలుపుతున్నారు.

    Also Read: చరణ్ ఎమోషనల్ ట్వీట్ పై ప్రశంసల వర్షం

    Tags