MLA Etela Rajender: ఈటల రాజేందర్ బిజెపిలో ఇమడలేకపోతున్నారు. అత్మగౌరవం కరువైందని బిజెపిలో చేరితే ఆయన్ని పలుకరించేవారే కరువయ్యారు. తెలంగాణ బిజెపిలో ఈటల రాజేందర్ ప్రస్థానం నామమాత్రంగా మారిపోయింది. టిఆర్‌ఎస్‌తో విభేదించిన తర్వాత ఈటలను బిజెపిలో చేర్చుకోవడం కోసం జాతీయ నాయకత్వం చూపిన ఉత్సాహం పార్టీలో చేరిన తర్వాత అడుగంటిపోయింది. రాష్ట్ర బిజెపి నాయకత్వం కూడా ఈటలను కార్నర్ చేసింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాజకీయాల్లో బిజీ కావడంతో పార్టీలో ఈటలను పలుకరించే కరువయ్యారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఈటల రాజేందర్ విషయంలో ఎక్కడా పాజిటివ్‌గా స్పందించలేదు.

ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఉపఎన్నికల్లో అధికార పార్టీని ఓడించి గెలిచిన తీరు బీజేపీకి రాష్ట్రంలో ఎక్కడా లేని ఊపునిచ్చింది. అటు తర్వాత బీజేపీ దూకుడుగా పార్టీ కార్యక్రమాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్‌కు ఆ పార్టీలో మంచి స్థానం, స్థాయి ఉంటుందని అంతా భావించారు. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్నాకొద్దీ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువవుతున్నాయి. ఈ చట్రంలో ఈటల రాజేందర్ కూడా ఇరుక్కున్నారు. ఆయనకు ప్రాముఖ్యం కల్పిస్తే తమ సీటుకెక్కడ ఎసరు వస్తుందోనన్న భావనలో రాష్ట్ర నాయకత్వం, కేంద్ర మంత్రి బేరీజు వేసుకుంటున్నట్టు సమాచారం. రాష్ట్ర బిజెపిలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది స్పష్టత లేక ఎవరికి వారే వర్గాలు ఏర్పాటు చేసుకున్నారు. కొత్తగా బిజెపిలో చేరిన ఈటల రాజేందర్ ప్రస్థానం ప్రశ్నార్థకమైంది.
Also Read: Kiran Kumar Reddy: ఆయన చేరికకు బ్రేక్.. కిరణ్‌కుమార్‌కు ద్వారాలు మూసేసిన కాంగ్రెస్
బండి సంజయ్ కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి మధ్య విభేదాలు పెరిగిపోవడంతో బండి సంజయ్ రాష్ట్రంలో బిజెపిని అన్ని తానై నడిపిస్తున్నానే సమాచారాన్ని జాతీయ నాయకత్వానికి చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈటల రాజేందర్‌కు జాతీయ పార్టీలతో పెద్దగా పరిచయం లేకపోవడం ఆపై వర్గాలుగా విడిపోయిన కమలనాథులతో ప్రయాణం సాగించలేక కాంగ్రెస్ గూటికి రంగం సిద్దం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. టిఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఉద్యమంలో చురుకుగా పనిచేసిన ఈటల రాష్ట్ర రాజకీయాల్లో రెండవ స్థానంలో ఉన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈటలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆర్థిక మంత్రి ఇచ్చి ప్రోత్సహించారు.

టిఆర్‌ఎస్ వీడినప్పటి నుండి ఈటలకు అడుగడుగునా కష్టాలే. ఈటల రాజేందర్ తన వర్గంతో కాంగ్రెస్‌లో చేరడానికి చర్చలు జరుపుతున్నట్లు స్పష్టమవుతున్నది. హుజురాబాద్ నియోజక వర్గంలోనే కాకుండా రాష్ట్రంలోనే మంచి పేరు సంపాదించుకున్న ఈటల బిజెపిని వదిలి కాంగ్రెస్‌లో చేరడం పట్ల విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టిఆర్‌ఎస్‌ను విభేదించినప్పుడే కాంగ్రెస్‌లో చేరి ఉంటే ఇప్పటికి ఆయన రాజకీయ భవితవ్యంపై ఒక క్లారిటి వచ్చి వుండేదని అనవసరంగా బిజెపిలో చేరి సమయం వృధా చేసుకున్నాడే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో బిజెపిలో చేరడమే సరైన ఆలోచన అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్‌ను తట్టుకోవడానికి బిజెపినే సరియైన పార్టీ అని అనుచర వర్గం అభిప్రాయం మేరకు బిజెపిలో చేరినా భవితవ్యం ప్రశ్నార్థకమైంది. కాంగ్రెస్‌లో కూడా గ్రూపు తగాదాలు శరామామూలే. కాంగ్రెస్‌లో కూడా ఈటల ఇముడుతారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.
Also Read:Atmakur By-Election : ఆత్మకూరు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
[…] […]
[…] […]