Kiran Kumar Reddy: ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన తెలంగాణ ఏర్పాటు తర్వాత రాజకీయంగా తెరమరుగయ్యారు. దాదాపు 8 ఏళ్లు పాలిటిక్స్‌కు దూరంగా ఉన్న ఆయన తాజాగా మళ్లీ యాక్టీవ్ అయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల్లో మళ్లీ అరంగేట్రం చేసేందకు తనను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన పార్టీ.. ఆ పార్టీ అప్పటి అధ్యక్షురాలు, నేటి తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీని నమ్ముకున్నారు. దేశ రాజకీయాల్లో రోజురోజుకూ దిగజారుతున్న కాంగ్రెస్‌కు జవసత్వాలు తెచ్చే ప్రయత్నం చేస్తున్న సోనియాగాంధీని కలిసి ఆంధ్రప్రదేశ్‌లో ఐసీయూలో ఉన్న కాంగ్రెస్‌కు తాను చికిత్స చేస్తానంటూ ముందుకు వచ్చారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీని కలిసి ఏపీలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తెస్తానని చెప్పుకొచ్చారు. దీంతో కాంగ్రెస్‌లో ఆయన‡ చేరిక దాదాపు ఖరారైందన్న వార్తలు వచ్చాయి. కానీ ఏమైందో ఏమో.. ఒక్కసారిగా కాంగ్రెస్ ద్వారాలు మూసుకుపోయాయి. సోనియాగాంధే మూసేసిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

రాష్ట్ర విభజన కారణంగా రాజకీయాలకు దూరం..
రాజకీయాల్లో రాణించడం అంత ఈజీకాదు. కాంగ్రెస్ అధిష్టానం అనూహ్య ఎంపిక కారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా ఎంపికైన నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి.. రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. ఇటీవల ఆయన మళ్లీ వార్తల్లో నిలిచారు. కొద్దిరోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన కిరణ్‌కుమార్‌రెడ్డి.. సోనియాగాంధీతో సమావేశమయ్యేందుకు వేచి ఉన్నారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జరిగింది.
Also Read: Atmakur By-Election : ఆత్మకూరు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
ఏదో ఒక రాష్ట్ర ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని కొందరు.. ఏపీ పీసీసీ చీఫ్‌గా నియమించే చాన్స్ ఉందని మరికొందరు భావించారు. కానీ అసలు తాను ఏ విషయమై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశం అయ్యాననే విషయాన్ని మాత్రం కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పలేదు. ఎంత సైలెంట్‌గా సోనియాగాంధీతో సమావేశమయ్యారో… అంతే సైలెంట్‌గా ఢిల్లీ నుంచి వెళ్లిపోయారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి.

సైడయ్యారా.. సైడ్ చేశారా?
కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో రీఎంట్రీతోనే కీలక పదవి ఆశించారని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ అధినాయకత్వం అందుకు అంగీకరించలేదని కొందరు చర్చించుకుంటున్నారు. ఈ కారణంగానే కిరణ్ కుమార్‌రెడ్డి ఢిల్లీ నుంచి సైలెంట్‌గా వెళ్లిపోయారని భావిస్తున్నారు. మరికొందరైతే.. కిరణ్‌కుమార్‌రెడ్డి గురించి ఇలాంటి ఊహాగానాలు రావడం కొత్తేమీ కాదంటున్నారు. ఆయన ఏ విషయమైనా రహస్యంగా చేస్తారని.. అదే ఆయనకు మైనస్ అని మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు ఏదో చెప్పడానికి ఆయన వచ్చారని.. కానీ అది వర్కవుట్ కాకపోవడంతో సైలెంట్ అయిపోయారని భావిస్తున్నారు. ఏపీకి చెందిన కొంతమంది సీనియర్ నాయకులు కిరణ్‌కుమార్ రీఎంట్రీకి చెక్‌పెట్టారని తెలుస్తోంది. అందకే అధిష్టానం ఆయన రాకకు ద్వారాలు మూసేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరి.. మళ్లీ కిరణ్‌కుమార్‌రెడ్డి రాజకీయ తెరపైకి ఎప్పుడు.. ఎలా ఎంట్రీ ఇస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
Also Read:Bandi sanjay: శివం మాకు… శవం మీకు.. తెలంగాణలో మసీదులు తవ్వేందుకు సిద్దమా? బండి సంజయ్ వ్యాఖ్యల దుమారం
Recommended Videos:
[…] […]
[…] […]