MLA Balakrishna In Hindupur: ప్రముఖ సినీనటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎంత కోపంతో ఉంటాడో శాంతంగా ఉన్నప్పుడు అంత ప్రేమ కురిపిస్తాడు. ఇందుకు తాజా సంఘటనే నిదర్శనం. నిన్న హిందూపూర్ లో పేదలకు ఉచితంగా వైద్యం అందించే ఎన్టీఆర్ రథం ప్రారంభానికి హాజరైన ఆయన అందరిని ఆశ్చర్యపరచాడు. తనకు అభిమాని కాకున్నా, పార్టీ కార్యకర్తగా లేకున్నా ఓ సామాన్యుడి ఇంటికి వెళ్లి అందరిలో ఉత్కంఠ రేపాడు. అతడి పుట్టిన రోజు అని తెలుసుకుని ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలపడం సంచలనం కలిగించిది.

ఎన్టీఆర్ ఆరోగ్య రథంలో ఒక వైద్యుడు, ఒక నర్సు, ఒక ఫార్మాసిస్ట్, ఆరుగురు వైద్య సిబ్బంది, ఒక మెడిసన్ కౌంటర్, కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారు. వారు సాధారణ వ్యాధులకు చికిత్స, ఉచితంగా మందులు ఇస్తారు. దీంతో బాలయ్య హిందూపూర్ పై మరోమారు దృష్టి సారించారు. ఇక్కడ మ్యాట్రిక్ సాధించడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇక్కడ పర్యటిస్తూ ప్రజల్లో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. తన తండ్రి నుంచి వస్తున్న విజయాన్ని తాను కూడా కొనసాగిస్తున్నాడు.
Also Read: Vijayashanthi BJP: ఆఖరుకు బీజేపీలోనూ ‘రాములమ్మ’ ఇమడలేకపోయిందే? లోపం ఎక్కడబ్బా?
అభిమానులను ఆశ్చర్యానికి గురి చేయడంలో కూడా బాలయ్య ఎప్పుడు ముందుంటాడు. నిన్న హిందూపూర్ లో్ పర్యటించిన బాలయ్య అతడి పుట్టిన రోజు అని తెలుసుకుని అతడికి ఆశ్చర్యం కలిగేలా చేస్తూ ఇంటికి రావడంతో అందరు అవాక్కయ్యారు. బాలయ్య అభిమానుల కోసం అప్పుడప్పుడు సంచలనాలు చేయడం అలవాటే. తనకు నచ్చితే ఏదైనా చేస్తారు. నచ్చకపోతే దేన్నయినా వదిలేయడం బాలయ్యకున్న ఇంకో అలవాటు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆయన హిందూపూర్ లో అందరిని ఆశ్చర్య చకితులను చేసి ఓ అభిమాని ఇంటికి వెళ్లి అతడిని దీవించడం చర్చనీయాంశం అయింది.

బాలయ్యకు బాధ వచ్చినా తట్టుకోలేరు. సంతోషమొస్తే ఆగలేరు. అది ఆయన మనస్తత్వం. బాలయ్యకు తప్పు అనిపిస్తే పదిమందిలో అయినా చెంప చెల్లుమనిపించడం ఆయన నైజం. అలాంటి బాలయ్య అభిమానుల విషయంలో మాత్రం దేవుడే. దీంతో బాలకృష్ణ చిరాకు గురించి అందరికి తెలిసిందే. అభిమానుల ఆశలు తీర్చడంలో కూడా ముందుంటారు. వారి యోగ క్షేమాలపై దృష్టి సారించి వారి కోరికలు నెరవేర్చడం చూస్తుంటాం. గతంలో కూడా ఇలాగే కర్నూలు జిల్లాలో ఓ అభిమాని ఇంటికి ఇలాగే వెళ్లి వారిని సైతం ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే.
Also Read:Munugode Bypoll- Left Parties: మునుగోడు కోసం కమ్యూనిస్టులతో టిఆర్ఎస్ లాలూచీ