నరసరావుపేటలో ‘మిషన్ 15’

గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో ‘మిషన్ 15‘ పేరుతో కార్యాచరణ అక్కడి అధికారులు ప్రారంభించారు. గుంటూరులో బుధవారం కొత్తగా మరో 12 కేసులు నమోదు అవగా వాటిలో 10 కేసులు నరసరావుపేటల నుంచే నమోదవుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. గుంటూరు సిటీలో 162 కేసులు, నరసరావుపేట లో 163 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇంకా, 500 కు పైగా నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. అత్యవసర నిధిని ఏర్పాటు చేయండి: పవన్ ఇక గుంటూరు జిల్లాలోనే […]

Written By: Neelambaram, Updated On : May 6, 2020 8:01 pm
Follow us on


గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో ‘మిషన్ 15‘ పేరుతో కార్యాచరణ అక్కడి అధికారులు ప్రారంభించారు. గుంటూరులో బుధవారం కొత్తగా మరో 12 కేసులు నమోదు అవగా వాటిలో 10 కేసులు నరసరావుపేటల నుంచే నమోదవుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. గుంటూరు సిటీలో 162 కేసులు, నరసరావుపేట లో 163 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇంకా, 500 కు పైగా నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని సంబంధిత అధికారులు తెలిపారు.

అత్యవసర నిధిని ఏర్పాటు చేయండి: పవన్

ఇక గుంటూరు జిల్లాలోనే అత్యధిక కేసులు నమోదైన నరసరావుపేటలో ‘కరోనా’ నియంత్రణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నరసరావుపేటలో ‘మిషన్ 15’ పేరుతో కార్యాచరణ ప్రారంభించారు. పదిహేను రోజుల తర్వాత కొత్త కేసులు ఉండకూడదన్న లక్ష్యంతో ఈ ప్రత్యేక చర్యలు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు.

వలస కూలీలకు చేయూతనివ్వండి:జగన్

కాగా, ‘కరోనా’ హాట్ స్పాట్ గా మారిన నరసరావుపేటలో రోజుకు 10 నుంచి 15 కొత్త కేసులు నమోదవుతున్నాయి. పాలు, నిత్యావసరాలను అధికారులు నేరుగా ఇళ్లకే సరఫరా చేస్తున్నారు. ఒరవకట్ట, రామిరెడ్డి పేట, ప్రకాష్ నగర్, శ్రీరాంపురం, ఏనుగుల బజారు, నిమ్మతోట తదితర ప్రాంతాలు రెడ్ జోన్ లో ఉన్నాయి. పరిసర గ్రామాల్లోని వారిని పట్టణంలోకి రానివ్వడం లేదు.