Homeఎంటర్టైన్మెంట్చిరంజీవి తో జెంటిల్ మాన్ శంకర్ మూవీ

చిరంజీవి తో జెంటిల్ మాన్ శంకర్ మూవీ


మెగాస్టార్ చిరంజీవి అభిమానులు భారీ చిత్రాల దర్శకుడిగా పేరున్న జెంటిల్ మాన్ శంకర్ తో మూవీ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఐతే ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ చేసేందుకు కొందరు బడా నిర్మాతలు సిద్ధం అవుతున్నారట. ఓ భారీ పాన్ ఇండియా మూవీ వీరి కాంబినేషన్ లో తెరకెక్కించాలని వారు గట్టిగా ప్రయత్నిస్తున్నారు అని తెలుస్తోంది .. ప్రస్తుతం చిరంజీవి దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో `ఆచార్య `మూవీలో నటిస్తున్నారు. .ఐతే చిరంజీవికి శంకర్ సినిమాల మీదుండే మమకారం కొద్దీ మొదటి చిత్రం జెంటిల్ మెన్ హిందీ రీమేక్ లో చిరంజీవి నటించారు. అల్లు అరవింద్ నిర్మాతగా 1993లో వచ్చిన ఆ మూవీకి బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ దర్శకత్వం వహించారు.

నరసరావుపేటలో ‘మిషన్ 15’

భారతీయ సినిమాకు భారీతనాన్ని నేర్పిన ఘనత శంకర్ ది ….. కేవలం తమిళ హీరోలతో మాత్రమే సినిమాలు చేసే శంకర్ తెలుగులో ఏ ఒక్క స్టార్ హీరోతో ఇంతవరకు సినిమా చేయలేదు.కొంత కాలం క్రితం పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు లతో సినిమా చేయాలని శంకర్ ప్రయత్నించినా కుదర్లేదు . కాగా ఇపుడా అవకాశం చిరంజీవి దక్కించుకొనేలా ఉన్నాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version