Homeజాతీయ వార్తలుPahalgam type incident in Mira Bhayandar road: మినీ పాకిస్తాన్‌లో మరో పహల్గాం ఘటన..

Pahalgam type incident in Mira Bhayandar road: మినీ పాకిస్తాన్‌లో మరో పహల్గాం ఘటన..

Pahalgam type incident in Mira Bhayandar road: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో 2025, ఏప్రిల్‌ 22న పాకిస్తాన్‌ ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. పర్యాటకుల మతం అడిగి మరీ చంపేశారు. ముస్లింలను వదిలేశారు. హిందువులను చంపేశారు. 26 మంది యాత్రీకులు చనిపోయారు. ఈ ఘటనకు ప్రతీకారంగా కేంద్రం మే 7 నుంచి 10వ తేదీ వరకు ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్తాన్‌ను చావుదెబ్బకొట్టింది. పహల్గాం ఘటన తర్వాత దేశంలో ఉగ్రవాదులను కూకటి వేళ్లతో పెకలించి వేసే పని చేపట్టింది. ఇప్పటికే చాలా మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది. ఉగ్ర లింకులను బ్రేక్‌ చేసింది. ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్లను ఏరివేసింది. ఇటీవలే ఘటనకు ఏడాది పూర్తయింది. ఈ క్రమంలో ముంబై సమీపంలో తాజాగా మరో మతపరమైన దాడి జరగడం దేశవ్యాప్త చర్చనీయాంశంగా మారింది. మీరా భాయిందర్‌ రోడ్డు నయానగర్‌లో వేకువజామున జరిగిన ఈ ఘటన పహల్గాం దాడి భయాన్ని పునరుద్ధరించింది.

పహల్గాం తరహాలోనే..
ఏప్రిల్‌ 22, 2025న జమ్మూ కాశ్మీర్‌ పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై మతం తెలుసుకుని కాల్పులు జరిపి 26 మందిని చంపారు. లష్కర్‌తో సంబంధం ఉన్న ఆర్టీఎఫ్‌ సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఈ దాడి చేశారు. ఏడాది తర్వాత ఇదే తతంగం ముంబైలో పునరావృతమైంది.

దాడి జరిగిందిలా..
వెకువ 4 గంటల సమయంలో నయానగర్‌లో ముస్లిం యువకుడు ఇద్దరు సెక్యూరిటీ గార్డులను (ఒకరు బెంగాల్‌ వాసి, మరొకరు ఉత్తరప్రదేశ్‌ నివాసి ప్రభాత్‌ మిశ్రా) మసీదు మార్గం అడిగాడు. వారు హిందువులమని చెప్పగానే ’కల్మా’ చదవమని ఆదేశించి, నిరాకరణకు కత్తితో దాడి చేశాడు. ప్రభాత్‌ మిశ్రా పొట్ట రెండు పాటు, పేగు గాయాలతో పరిస్థితి విషమంగా ఉంది. మరొకరికి చిన్న గాయాలయ్యాయి.

పోలీసు చర్యలు
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అరగంటలోనే నిందితుడు అన్సారీని అరెస్ట్‌ చేశారు. హత్యాయత్నం, మతపరమైన విద్వేషాలు కలిగించే సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. ముంబై ఏటీఎస్‌ విచారణ జరుపుతోంది.

మినీ పాకిస్తాన్‌గా..
మీరా భాయిందర్‌ రోడ్‌ ’మినీ పాకిస్తాన్‌’గా పిలువబడుతుంది. ఇక్కడ మతపరమైన ఉద్రిక్తతలు గతంలో కూడా జరిగాయి. దీపావళి సందర్భంగా హిందువులపై దాడులు జరిగిన మునుపటి ఘటనలు ఈ దాడిని మరింత సున్నితంగా మార్చాయి.

పహల్గాం లాంటి మతపరీక్ష దాడి దేశవ్యాప్త ఆందోళన రేపింది. హిందూ–ముస్లిం ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ. పోలీసు వేగవిచారణ వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తే ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version