Manchu Mohan Babu Family : మంచు కుటుంబంలో వివాదం మళ్ళీ చెలరేగింది. నేడు మనోజ్ తిరుపతి లోని మోహన్ బాబు విశ్వ విద్యాలయం లోకి నేడు మనోజ్ అడుగుపెట్టే ప్రయత్నం చేయగా, అక్కడి సెక్యూరిటీ ఆయన్ని అడ్డుకుంది. దీంతో కాలేజీ గేట్ వద్ద కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆ సమయంలో మోహన్ బాబు, విష్ణు కాలేజీ లోనే ఉన్నారు. రేణిగుంట విమానాశ్రయం లో దిగిన వెంటనే మనోజ్ భారీ ర్యాలీతో విశ్వ విద్యాలయం వైపు వస్తున్నాడనే విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున యూనివర్సిటీ వద్ద మోహరించారు. ఈ క్రమం లో భారీ ర్యాలీ తో అక్కడికి చేరుకున్న మనోజ్ ని స్టాఫ్ నిలువరించగా, ఆవేశంతో ఊగిపోయిన మనోజ్ అవ్వా, తాతల సమాధులను చూసేందుకు కూడా అనుమతించరా?, తలుపులు తీయండి అంటూ గట్టిగా అరిచాడు. ఎంత చెప్పినా తీయకపోవడంతో మనోజ్ అభిమానులు గేట్ల పైకి ఎక్కేసారు. దీంతో మోహన్ బాబు బౌన్సర్లు మనోజ్ అభిమానులపై దాడి చేసారు.
ఆ తర్వాత పోలీసులు వచ్చి లాఠీ ఛార్జి చేయడంతో పలువురు అభిమానులకు తీవ్రమైన గాయాలయ్యాయి. అనంతరం మనోజ్ ని భారీ బందోబస్తుతో యూనివర్సిటీ నుండి బయటకి పంపేశారు. ఈ సంఘటన కి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో బాగా చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజెన్స్ నుండి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. కన్న కొడుకు పట్ల ఈ విధంగా ప్రవర్తించడం ఏమాత్రం సరికాదు, శత్రువుతో ప్రవర్తిస్తున్నట్టు ప్రవర్తిస్తున్నారు మోహన్ బాబు, విష్ణు అని నెటిజెన్స్ విరుచుకుపడుతున్నారు. అయితే మనోజ్ నెల రోజుల క్రితం మోహన్ బాబు ఇంటి వద్ద సృష్టించిన వీరంగం ని చూసిన తర్వాత ఎవరైనా అతన్ని మళ్ళీ ఇలాంటి ప్రదేశాల్లో ప్రవేశించడానికి అనుమతిని ఇస్తారా?, ఇప్పటికే పోలీసులు, కేసులు అంటూ మోహన్ బాబు కుటుంబ పరువుని తీసేసాడు, ఇప్పుడు కాలేజీ లో చదువుతున్న విద్యార్థుల వద్ద కూడా హై డ్రామా ని నిర్వహించి, అక్కడ కూడా కుటుంబ పరువు తీయాలని అంటుకుంటున్నాడా అంటూ సోషల్ మీడియాలో మరికొంత మంది నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
సమస్య సర్దుకుందిలే అని అనుకున్న ప్రతీసారి ఈ వ్యవహారం కి సంబంధించి ఎదో ఒకటి జరుగుతూనే ఉంది. తప్పు ఎవరిదీ అనేది తెలియడం లేదు. సోషల్ మీడియా లో మనోజ్ కి మంచి ఫాలోయింగ్ ఉండడం తో ఆయనపట్ల మోహన్ బాబు కుటుంబం అన్యాయం గా వ్యవహరిస్తుందని, ఆస్తులు మొత్తం విష్ణు ఇచ్చి, మనోజ్ చేతికి ఏది దక్కకుండా చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే మనోజ్ చాలా కాలం తర్వాత మళ్ళీ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ఇప్పటికే ఆయన తేజ సజ్జ హీరో గా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘మిరాయ్’ లో సూపర్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలిసి ‘భైరవం’ అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు.
Done with Pandi Pi**aloda..
Now rey elugubantu pic.twitter.com/VzLcvooNK6— Movies4u Official (@Movies4u_Officl) January 15, 2025