Minister Roja: మోచేతిలో బలముంటే మొండికొడవలైనా తెగుతుంది. అధికారంలో ఉంటే ఎంత పని అయినా సువులుగా అయిపోతోంది సామాన్యుడి రూ.10 లక్షలు పోయినా పట్టించుకోరు కానీ మంత్రి గారి ఫోన్ పోయిందంటే నానా హంగామా చేశారు. పదివేల ఫోన్ కోసం పోలీసులు నానా రభస చేశారు. మూడు టీంలుగా ఏర్పడి మరీ మంత్రి గారి దగ్గర మార్కులు కొట్టేశారు. తామున్నది మీ సేవకే అంటూ తలూపారు. సెల్ ఫోన్ దొరికేదాకా టెన్షన్ పడ్డారు.దీంతో పోలీస్ ఉన్నతాధికారుల హడావిడి చూస్తుంటే అందరికి ఆశ్చర్యం వేసింది. అధికారమా మజానా అని అందరు నోరెళ్లబెట్టారు ఈ సినిమా అంతా తిరుపతిలో చోటుచేసుకుంద ఇటీవల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజా తిరుపతిలో పర్యటనకు వచ్చిన సందర్భంగా నడిచిన హైడ్రామా ఇది
రోజా ఒక రోజు పర్యటన కోసం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమానికి హాజరయ్యారు అనంతరం తన సెల్ ఫోన్ పోయిందని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వెంటనే రంగంలోకి దిగారు మూడు టీంలుగా ఏర్పడి ముప్పతిప్పలు పడ్డారు. సీసీ కెమెరాలు పరిశీలించారు. సెల్ ఫోన్ ఎక్కడ తస్కరణకు గురైందనే దానిపై ఓ అవగాహనకు వచ్చారు. దీంతో సెల్ ఫోన్ ను చోరీ చేసిన వ్యక్తిని పట్టుకున్నారు సెల్ నెంబర్ ఆధారంగా స్పాట్ కు చేరుకుని నిందితుడి వద్ద నుంచి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: AP News: సీఎం కాన్వాయ్ కైతే కారు ఇవ్వాల్సిందేనా?
అందుకే అంటారు అధికారం అంటేనే పరమపదసోపానం అందులో దొర్లితే మనకు ఏం తెలియదు. దానంతటవే పనులు జరిగిపోతాయి అధికారులు చెప్పుచేతల్లో ఉంటారు కనుచూపు మేర కనుసైగ చేస్తే అంత మన కంట్రోల్ లో ఉంటుంది. దీంతో పదవులంటే అందరికి ఇష్టంగా మారిపోయాయి ప్రస్తుత కాలంలో పరపతి లేనిదే ఏ పని జరగడం లేదు సామాన్యుడు కూడా తన పరపతి ఉపయోగించుకునే పనులు చేసుకునే రోజులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంత్రి పదవి కోసం అందరు ఎగబడుతున్నారు మంత్రి పదవి కోసం తాపత్రయపడుతున్నారు.
రోజా తిరుపతిలో జరిగే కార్యక్రమాల్లో అధికారికంగా పాల్గొన్నారు మంత్రి హోదాలో తిరుపతికి రావడం ఇదే ప్రథమం. దీంతో బందోబస్తు భారీగానే ఏర్పాటు చేశారు.. అయినా తన సెల్ ఫోన్ అపహరణకు గురికావడం అందరిలో ఆందోళనకు గురిచేసింది దీంతో అధికారులు నానా హైరానా పడ్డారు. సెల్ ఫోన్ దొరికే వరకు టెన్షన్ కు గురయ్యారు మంత్రిగారి ఫోన్ దొంగతనానికి గురైందంటే ఎంతటి అవమానమని ఫీలయ్యారు. అందుకే మొత్తం యంత్రాంగమంతా కష్టపడి మరీ సెల్ ఫోన్ ను గుర్తించడ కొసమెరుపు.
Also Read:Super Star Mahesh Babu: ఆచార్య కోసం రంగం లోకి దిగిన సూపర్ స్టార్ మహేష్ బాబు