https://oktelugu.com/

మంత్రి పోస్టు ఊస్ట్: ట్విట్టర్, కరోనాతో సీనియర్లు ఔట్

ప్రధాని మోడీ షాక్ ఇచ్చాడు. కేబినెట్ లోని సీనియర్ మంత్రులకు ఉద్వాసన పలికారు. మోడీ కేబినెట్ లోని అత్యంత కీలక మంత్రులైన సీనియర్లను పక్కనపెట్టడం సంచలనమైంది. కేంద్ర కేబినెట్ లో ఈసారి భారీ మార్పులు చేపట్టి మోడీ ఆశ్చర్యపరిచాడనే చెప్పాలి. వరుసగా కేంద్రమంత్రులు రాజీనామాలు చేయడం సంచలనమైంది. తాజాగా మరో ఇద్దరు కేంద్రమంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇప్పటికే కేంద్రవైద్యశాఖ మంత్రి హర్షవర్ధన్ సహా 10 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయగా.. తాజాగా […]

Written By:
  • NARESH
  • , Updated On : July 7, 2021 7:40 pm
    Follow us on

    ప్రధాని మోడీ షాక్ ఇచ్చాడు. కేబినెట్ లోని సీనియర్ మంత్రులకు ఉద్వాసన పలికారు. మోడీ కేబినెట్ లోని అత్యంత కీలక మంత్రులైన సీనియర్లను పక్కనపెట్టడం సంచలనమైంది. కేంద్ర కేబినెట్ లో ఈసారి భారీ మార్పులు చేపట్టి మోడీ ఆశ్చర్యపరిచాడనే చెప్పాలి.

    వరుసగా కేంద్రమంత్రులు రాజీనామాలు చేయడం సంచలనమైంది. తాజాగా మరో ఇద్దరు కేంద్రమంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇప్పటికే కేంద్రవైద్యశాఖ మంత్రి హర్షవర్ధన్ సహా 10 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయగా.. తాజాగా కేంద్ర న్యాయ, ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్ లు రాజీనామా చేయడం పెను సంచలనమైంది.

    బీజేపీలోనే సీనియర్లు అయిన రవిశంకర్ ప్రసాద్ కు ఎంతో అనుభవం ఉంది. న్యాయ, ఐటీ శాఖ మంత్రిగా ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఇటీవల ట్విట్టర్ తో కేంద్రానికి జరిగిన వివాదంలో రవిశంకర్ చర్యల వల్లే కేంద్రం అభాసుపాలైందని.. ఐటీ శాఖ నిబంధనలు, ట్విట్టర్ తో ఫైట్ జరిపి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేశాడని ఆయనపై ఆరోపణలున్నాయి. అందుకే సీనియర్ అయిన కూడా బీజేపీ ఆయన చేత రాజీనామా చేయించడం సంచలనమైంది.

    ఇక దేశంలో కరోనాను ఎదుర్కోవడంలో ఆక్సిజన్, మందుల కొరత, వ్యాక్సినేషన్ విషయంలో అడ్డంగా ఫ్లాప్ అయ్యింది మోడీ సర్కార్. దీనికంతటికి ఆ శాఖ చూసిన హర్షవర్ధన్ కారణమని ఆయన చేత రాజీనామా చేయించాడు మోడీ.

    ఇక ప్రకాష్ జవదేకర్ చాలా చురుకైన మంత్రి. పర్యావరణ శాఖ మంత్రిగా చాలా బాగా పనిచేస్తున్నాడు. ఈ సీనియర్ ను సైతం ఎందుకు రాజీనామా చేయించాడన్నది మీడియా సర్కిల్స్ లోనూ ఆశ్చర్యం కలిగిస్తోంది. మొత్తంగా సీనియర్లకు మంగళం పాడి కొత్త వారికి పదవులు ఇవ్వడానికి మోడీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడని తెలుస్తోంది.