Mallareddy: అద్భుత విద్యావేత్త మల్లారెడ్డికి అర్జెంటుగా విద్యా శాఖ అప్పగిస్తే ఏమవుతుంది?

Mallareddy: మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తన హత్యకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కుట్రపన్నారని ఆరోపించారు. రెడ్ల మహాసభలో ప్రసంగించడానికి నిలుచున్న మల్లారెడ్డిని కొందరు అడ్డుకున్నారు. ప్రసంగించకుండా గోల గోల చేశారు. అనంతరం స్టేజీ మీద నుంచి దిగి వెళ్లిపోతున్న మల్లారెడ్డి కాన్వాయ్ పై కుర్చీలు, చెప్పులు విసిరి దాడి చేశారు. ఈ ఘటన తర్వాత మల్లారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు రేవంత్ రెడ్డి కుట్రపన్నారని ఆరోపించారు. ఒక అధికార పార్టీ […]

Written By: NARESH, Updated On : May 31, 2022 11:41 am
Follow us on

Mallareddy: మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తన హత్యకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కుట్రపన్నారని ఆరోపించారు. రెడ్ల మహాసభలో ప్రసంగించడానికి నిలుచున్న మల్లారెడ్డిని కొందరు అడ్డుకున్నారు. ప్రసంగించకుండా గోల గోల చేశారు. అనంతరం స్టేజీ మీద నుంచి దిగి వెళ్లిపోతున్న మల్లారెడ్డి కాన్వాయ్ పై కుర్చీలు, చెప్పులు విసిరి దాడి చేశారు.

ఈ ఘటన తర్వాత మల్లారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు రేవంత్ రెడ్డి కుట్రపన్నారని ఆరోపించారు. ఒక అధికార పార్టీ మంత్రిని.. అంత మంది పోలీసుల సెక్యూరిటీ నడుమ.. ప్రతిపక్ష నేత అనుచరులు హత్యకు కుట్ర చేయడం అంటే నమ్మశక్యంగా లేదు.

ఈ ఉపద్రవానికి ఖచ్చితంగా మల్లారెడ్డినే కారణం అని కొందరు అంటున్నారు. తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఫుల్ ఫాలోయింగ్ ఉంది. పైగా రెడ్లకే అధికారం ఇవ్వాలని మాట్లాడి ఆ రెడ్లసభలో రేవంత్ మంచి మార్కులు కొట్టేశాడు. ఇక మల్లారెడ్డి మాట్లాడితే సెటైర్లు, బూతులే కానీ.. వారి సంక్షేమానికి పాటుపడడం లేదని వాళ్లు గుర్రుగా ఉన్నారు.

Also Read: Heroine Bold Comments: నేను సింగిల్‌ కాదు, మింగిల్‌.. క్రేజీ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్ !

ఇక రెడ్ల సంక్షేమం గురించి మాట్లాడాల్సిన మల్లారెడ్డి అది మరిచి తన ప్రత్యర్థి అయిన రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేసరికి హార్ట్ అయిన కొందరు తరిమికొట్టారు. అంతమాత్రానికే తన హత్యకు కుట్ర అనడం ఏమంత ఆమోదయోగ్యంగా లేదు.

కార్మిక శాఖ మంత్రిగా ఉన్న మల్లారెడ్డి ఆ శాఖలో తన రెడ్డి సామాజికవర్గానికి ఏం చేయలేకపోతున్నారని దాడి చేసిన కొందరు విమర్శించారు. వేరే శాఖలో ఉన్నా కూడా మంత్రి మల్లారెడ్డి ఇంతేనన్న సంగతి ఎవ్వరికీ తెలియదు.  నిజంగానే విద్యావేత్త అయిన మల్లారెడ్డికి విద్యాశాఖ ఇస్తే తనకు అనుగుణంగా వ్యవస్థనే మార్చేశాడని కొందరు సెటైర్లు వేస్తున్నారు. ‘నెలల్లో డిగ్రీ, రెండు నెలల్లో పీజీ, నాలుగు నెలల్లో డాక్టరేట్…. ఈ స్కీం పెట్టేసి… ఏడాదిలో “అక్షర తెలంగాణ” సాధించేసి… కొత్త శక పురుషుడు అయ్యేవాడు … ఇప్పటికైనా మించి పోలేదు… ’ అంటూ కొందరు మల్లారెడ్డిపై ఎద్దేవా చేస్తున్నారు. ఎప్పుడూ గొడవలు.. సంచలన కామెంట్లతో హోరెత్తించే మల్లారెడ్డికి ఏ శాఖ ఇచ్చినా ఆయన వాయిస్ మాత్రం మారదని కొందరు అంటున్నారు.

Also Read: Kaleswaram Is Closing: కాళేశ్వరం మూసివేత తప్పదా?.. ఈ పరిస్థితి ఎందుకు?

Recommended Videos: