Mallareddy: మంత్రి మల్లారెడ్డి అమాయకుడట.. అంతా రేవంతే చేశాడట

Mallareddy: తెలంగాణలో (Telangana) నాయకుల మధ్య ఆరోపణల పర్వం సాగుతోంది. పీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి (Revanth Reddy), మంత్రి మల్లారెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మంత్రి భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. భూములు, ఆస్పత్రులు, యూనివర్సిటీ వంటి వాటిలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆక్రమించుకున్నారని విరుచుకుపడుతున్నారు. దీనికి మంత్రి మల్లారెడ్డి కూడా స్పందించి ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి తీరుపై ఆక్షేపించారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడుతున్నారు. […]

Written By: Srinivas, Updated On : August 29, 2021 4:41 pm
Follow us on

Mallareddy: తెలంగాణలో (Telangana) నాయకుల మధ్య ఆరోపణల పర్వం సాగుతోంది. పీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి (Revanth Reddy), మంత్రి మల్లారెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మంత్రి భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. భూములు, ఆస్పత్రులు, యూనివర్సిటీ వంటి వాటిలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆక్రమించుకున్నారని విరుచుకుపడుతున్నారు. దీనికి మంత్రి మల్లారెడ్డి కూడా స్పందించి ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి తీరుపై ఆక్షేపించారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడుతున్నారు. ఏవో దొంగ కాగితాలు సృష్టించి అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నారు.

రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే ప్రభుత్వ భూముల్లోనే కాలేజీలు ఉన్నాయనే విషయంలో మంత్రి మల్లారెడ్డి కొట్టిపారేయలేదు. ప్రైవేటు వ్యక్తుల వద్ద కొనుగోలు చేశారా లేదా అన్న విషయాలను స్పష్టం చేయలేదు. ప్రస్తుతం రాజకీయం అంతా భూ కబ్జాలపై నడుస్తోంది. తన కాలేజీల పై బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. తనపై కక్షతోనే ఇరికిస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ర్టంలో రాజకీయం పలు కీలక మలుపులు తిరుగుతోంది.

జవహర్ నగర్ లో ఉన్న భూములన్నీ ప్రభుత్వ భూమలేనని మంత్రి ఒప్పుకున్నారు. పేద ప్రజల కోసమే ఆస్పత్రి నిర్మించానని పేర్కొనడంతో ఆయన ఆ భూములపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రభుత్వ భూములు కావడంతోనే రేవంత్ రెడ్డి వాటిపై ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాటిపై ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో తెలియడం లేదు.

ఈ నేపథ్యంలో రాజకీయ కోణంలో చూసినా మల్లారెడ్డికి చిక్కులు తప్పేలా లేవని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఆరోపణలు అవాస్తవాలైతే మంత్రి ఫిర్యాదు చేస్తే క్షణాల్లో రేవంత్ ను పోలీసులు అరెస్టు చేసి ఉండేవారు. దీంతో బ్లాక్ మెయిల్ రాజకీయాలంటూ కొట్టిపారేస్తున్నారే కాని వాటిపై మాత్రం క్లారిటీ ఇవ్వకపోవడంతో అందరిలో అనుమనాలు కలుగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డిపై కూడా ఉచ్చు తప్పదని తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను కూడా ఇదే తీరుగా ఇరికించి పక్కకు పెట్టిన క్రమంలో ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి పై చర్యలు ఉంటాయా అనే సందేహాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి.