spot_img
Homeజాతీయ వార్తలుkandikonda: గేయ ర‌చ‌యిత కందికొండకు మంత్రి కేటీఆర్ అండ..

kandikonda: గేయ ర‌చ‌యిత కందికొండకు మంత్రి కేటీఆర్ అండ..

kandikonda: తెలంగాణ సంస్కృతి గురించి అద్భుతమైన పాటలు రాసిన ఆయన ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. తెలుగు సినిమా పాటల ప్రపంచంలో ఆయనది ఓ ప్రత్యేక స్థానం. ఆయనే సినీ గేయ రచయిత కందికొండ. కందికొండ పేరుతో బాగా పాపులర్ అయిన కందికొండ యాదగిరి..కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. గొంతు క్యాన్సర్‌తో ఇబ్బంది పడుతూ చికిత్స తీసుకుంటున్నారు కందికొండ. ఈ క్రమంలోనే ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. తమను ఆదుకోవాలంటూ కందికొండ కూతురు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు లేఖ రాసింది. కాగా, ఆపదలో ఉన్న కందికొండ కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి ఆదివారం ప్రకటించారు.

kandikonda
kandikonda

తండ్రి అనారోగ్యం, ఆస్పత్రిలో చికిత్స కారణంగా తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని, ఆర్థిక కష్టాల్లో ఉన్న తాము ఇంటి అద్దె కూడా కట్టే పరిస్థితుల్లో లేమ‌ని పేర్కొంది కంది కొండ కూతురు. కేటీఆర్‌కు రాసిన లేఖలో ఆమె తమ కష్టాలను గురించి పేర్కొంది. తమకు చిత్రపురి కాలనీలోనో లేదా ఇంకా ఏదేని ప్రదేశంలోనో ఇల్లు ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కందికొండ కుటుంబానికి గతంలో అండగా ఉన్నామని, ఇప్పుడూ ఉంటామని చెప్పారు. కందికొండ ఫ్యామిలీ విషయంలో తన ఆఫీసు సిబ్బంది, మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో మాట్లాడి సాయం చేస్తానని హామీనిచ్చారు.

Also Read: కేసీఆర్ కు చుక్కలు చూపిన మోడీ సర్కార్?

గొంతు కేన్సర్‌తో బాధపడుతున్న కందికొండ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. ఇకపోతే తెలుగు సినీ గేయ రచయితగా కందికొండ యాదగిరికి మంచి పేరుంది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ సినిమాలో ‘మళ్లి కూయవే గువ్వ’ సాంగ్ కందికొండ రచించినదే. ఈ పాట అప్పట్లో చాలా ఫేమస్ అయింది. ఈ పాటతోనే కందికొండ సినీ ఎంట్రీ జరిగింది. ఇక ఆ తర్వాత కాలంలో ‘ఇడియట్’ సినిమాలో ‘చూపులతో గుచ్చిగుచ్చి’ సాంగ్ రచించారు.

యూత్‌కు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం. ‘సత్యం’ ఫిల్మ్‌లో ‘మధురమే మధురమే’, పోకిరి చిత్రంలో ‘గల గల పారుతున్న గోదారి’, ‘లవ్ లీ’ మూవీలో టైటిల్ సాంగ్ ‘లవ్ లీ లవ్ లీ’ పాటలు కందికొండ రచించినవే. సినిమా పాటలతో పాటు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలపైన కందికొండ పాటలు రాశారు. బతుకమ్మ సంస్కృతి ప్రతిబింబించేలా చక్కటి పాటలు రచించారు కందికొండ. యాదగిరి చివరగా ‘నీది నాది ఒకే కథ’ సినిమాకు రెండు పాటలు రాశారు. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా ఇక పాటలు రాయలేకపోయారు.

Also Read: తీన్మార్ మల్లన్నతో ఈటలకు చెక్.. బీజేపీ నేత‌ల నయా ప్లాన్?

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper