kandikonda: తెలంగాణ సంస్కృతి గురించి అద్భుతమైన పాటలు రాసిన ఆయన ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. తెలుగు సినిమా పాటల ప్రపంచంలో ఆయనది ఓ ప్రత్యేక స్థానం. ఆయనే సినీ గేయ రచయిత కందికొండ. కందికొండ పేరుతో బాగా పాపులర్ అయిన కందికొండ యాదగిరి..కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. గొంతు క్యాన్సర్‌తో ఇబ్బంది పడుతూ చికిత్స తీసుకుంటున్నారు కందికొండ. ఈ క్రమంలోనే ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. తమను ఆదుకోవాలంటూ కందికొండ కూతురు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు లేఖ రాసింది. కాగా, ఆపదలో ఉన్న కందికొండ కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి ఆదివారం ప్రకటించారు.

తండ్రి అనారోగ్యం, ఆస్పత్రిలో చికిత్స కారణంగా తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని, ఆర్థిక కష్టాల్లో ఉన్న తాము ఇంటి అద్దె కూడా కట్టే పరిస్థితుల్లో లేమని పేర్కొంది కంది కొండ కూతురు. కేటీఆర్‌కు రాసిన లేఖలో ఆమె తమ కష్టాలను గురించి పేర్కొంది. తమకు చిత్రపురి కాలనీలోనో లేదా ఇంకా ఏదేని ప్రదేశంలోనో ఇల్లు ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కందికొండ కుటుంబానికి గతంలో అండగా ఉన్నామని, ఇప్పుడూ ఉంటామని చెప్పారు. కందికొండ ఫ్యామిలీ విషయంలో తన ఆఫీసు సిబ్బంది, మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో మాట్లాడి సాయం చేస్తానని హామీనిచ్చారు.
Also Read: కేసీఆర్ కు చుక్కలు చూపిన మోడీ సర్కార్?
గొంతు కేన్సర్‌తో బాధపడుతున్న కందికొండ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. ఇకపోతే తెలుగు సినీ గేయ రచయితగా కందికొండ యాదగిరికి మంచి పేరుంది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ సినిమాలో ‘మళ్లి కూయవే గువ్వ’ సాంగ్ కందికొండ రచించినదే. ఈ పాట అప్పట్లో చాలా ఫేమస్ అయింది. ఈ పాటతోనే కందికొండ సినీ ఎంట్రీ జరిగింది. ఇక ఆ తర్వాత కాలంలో ‘ఇడియట్’ సినిమాలో ‘చూపులతో గుచ్చిగుచ్చి’ సాంగ్ రచించారు.
యూత్‌కు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం. ‘సత్యం’ ఫిల్మ్‌లో ‘మధురమే మధురమే’, పోకిరి చిత్రంలో ‘గల గల పారుతున్న గోదారి’, ‘లవ్ లీ’ మూవీలో టైటిల్ సాంగ్ ‘లవ్ లీ లవ్ లీ’ పాటలు కందికొండ రచించినవే. సినిమా పాటలతో పాటు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలపైన కందికొండ పాటలు రాశారు. బతుకమ్మ సంస్కృతి ప్రతిబింబించేలా చక్కటి పాటలు రచించారు కందికొండ. యాదగిరి చివరగా ‘నీది నాది ఒకే కథ’ సినిమాకు రెండు పాటలు రాశారు. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా ఇక పాటలు రాయలేకపోయారు.
Also Read: తీన్మార్ మల్లన్నతో ఈటలకు చెక్.. బీజేపీ నేతల నయా ప్లాన్?