https://oktelugu.com/

ఏపీతోనే కాదు.. దేవుడితోనైనా కొట్లాడుతాం

మొన్నటికి మొన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ కేటీఆర్ తాజాగా ఏపీతో ఫైట్ కు దిగారు. హాట్ కామెంట్స్ చేశారు. కృష్ణా జలాల వివాదంలో అవసరమైతే ఏపీతోనే కాదు.. దేవుడితో కూడా కొట్లాడుతానని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం రావాల్సిన నీటి వాటాను సాధించుకుంటామన్నారు. నారాయణపేటలో పర్యటించిన కేటీఆర్ చిన్నపిల్లల ఐసీయూను ప్రారంభించిన అనంతరం […]

Written By:
  • NARESH
  • , Updated On : July 10, 2021 4:37 pm
    Follow us on

    KTR

    మొన్నటికి మొన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ కేటీఆర్ తాజాగా ఏపీతో ఫైట్ కు దిగారు. హాట్ కామెంట్స్ చేశారు. కృష్ణా జలాల వివాదంలో అవసరమైతే ఏపీతోనే కాదు.. దేవుడితో కూడా కొట్లాడుతానని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    కృష్ణా జలాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం రావాల్సిన నీటి వాటాను సాధించుకుంటామన్నారు.

    నారాయణపేటలో పర్యటించిన కేటీఆర్ చిన్నపిల్లల ఐసీయూను ప్రారంభించిన అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. నారాయణపేటకు 10కి.మీల దూరంలోనే కర్ణాటక ఉందని.. ఆ రాష్ట్రంలో తెలంగాణలో అమలవుతున్న ఏ ఒక్క పథకమైనా ఉందా? అని బీజేపీని ఎండగట్టారు. రైతుబంధు, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు కర్ణాటకలోని బీజేపీ సర్కార్ అమలు చేస్తుందో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

    దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఉందని వివరించారు.

    కృష్ణా జలాల విషయంలో ఏపీ, తెలంగాణ మంత్రులు, నేతల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. కృష్ణా నది పారే నారాయణ పేట జిల్లాలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇక ఏపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడమని సంకేతాలు ఇచ్చినట్టు అయ్యింది.