అమరావతిని పూర్తిగా లేపేసేలా వైసీపీ ప్లాన్?

ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వివాదాస్పద అంశాలపై ముందుగా మంత్రులతో నోరు జారేలా చేస్తున్నారు జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఈ బాధ్యతను సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ తలకెత్తున్నాడు. అమరావతిపై ఆయన చేసిన కామెంట్లు కాక రేపాయి. ఏపీ రాజధాని తరలింపు అంశాన్ని బొత్సతో లేవనెత్తించి వ్యూహాత్మకంగా వైఎస్ జగన్ దీన్ని చర్చకు బెట్టి ప్రతిస్పందన చూశారు. ఆ తర్వాత 3 రాజధానుల ప్లాన్ చేశారు. Also Read: చంద్రబాబు తపో భంగానికీ […]

Written By: NARESH, Updated On : September 8, 2020 2:07 pm
Follow us on


ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వివాదాస్పద అంశాలపై ముందుగా మంత్రులతో నోరు జారేలా చేస్తున్నారు జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఈ బాధ్యతను సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ తలకెత్తున్నాడు. అమరావతిపై ఆయన చేసిన కామెంట్లు కాక రేపాయి. ఏపీ రాజధాని తరలింపు అంశాన్ని బొత్సతో లేవనెత్తించి వ్యూహాత్మకంగా వైఎస్ జగన్ దీన్ని చర్చకు బెట్టి ప్రతిస్పందన చూశారు. ఆ తర్వాత 3 రాజధానుల ప్లాన్ చేశారు.

Also Read: చంద్రబాబు తపో భంగానికీ ఏపీ బీజేపీ పెద్ద ప్లాన్లు?

అయితే ఇప్పుడు అమరావతి రాజధాని మార్పు కు న్యాయ చిక్కులు వచ్చిపడుతున్నాయి. అమరావతి చుట్టే ఏపీ రాజధాని మార్పు ఆగుతోంది. ఈ క్రమంలోనే అసలు రాజధానిగా అమరావతినే లేకుండా చేస్తే ఎలా ఉంటుందని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది..   ఆ ప్రాంత ప్రజలు, ఎమ్మెల్యేల ద్వారానే ఈ వాణి వినిపించేలా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

దీనికి బలాన్ని ఇస్తూ అమరావతి ప్రాంతానికే చెందిన మంత్రి కొడాలి నాని తాజాగా బాంబు పేల్చారు.  మరో సంచలన ప్రతిపాదన చేశారు. అమరావతి రాజధానిగా వద్దు అని ఆయన తేల్చిచెప్పారు.   పేద ప్రజలు ఉండేందుకు వీల్లేని అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దు అని సీఎం జగన్ ను కలిసి చెప్పినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.తన ప్రతిపాదనకు అన్ని పక్షాలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ చెప్పారని మంత్రి నాని సోమవారం సంచనల ప్రకటన చేశారు.

Also Read: జగన్ పై హిందువుల వ్యతిరేకతకు ప్రధాన కారణాలేమిటి?

దీంతో అమరావతిలో అసలు శాసన రాజధాని కూడా లేకుండా చేయాలని ఏపీ సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అమరావతిలో 55వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కోర్టు కు వెళ్లి స్టే తీసుకురావడంపై మంత్రి నాని విమర్శించారు.  అమరావతి భూములను పేదలకు పంచి సెటిల్ చేయాలని.. అమరావతినే లేకుండా చేయాలని వైసీపీ సర్కార్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.