https://oktelugu.com/

Kodali Nani: ద్యావుడా.. కొడాలి నాని బూతు బాగోతం వింటే ఖతమే.. ‘క్యాసినో’ నిరూపిస్తే పెట్రోల్ పోసుకొని చస్తాడట.?

Kodali Nani: చంద్రబాబు గాడు.. లుచ్చా.. బ్రోకర్.. వాడి కుక్కలు.. వేస్ట్ గాళ్లు.. వెధవ..’ అబ్బో ఇంకా చాలా మాట్లాడాడు ఏపీ మంత్రి కొడాలి నాని.. కానీ వెబ్ సైట్ లో అన్ని బూతులు రాయలేం కదా.. సెన్సార్ చేసి కొన్నింటిని మాత్రమే మీకు రుచిచూపించాం.. ‘క్యాసినో’ వివాదంలో ఏపీ మంత్రి కొడాలి నాని బూతుల వర్షం కురిపించారు. అసలు వినడానికి కూడా వీల్లేని స్థాయిలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. ఏపీ మంత్రి కొడాలి నానికి […]

Written By:
  • NARESH
  • , Updated On : January 21, 2022 / 06:26 PM IST
    Follow us on

    Kodali Nani: చంద్రబాబు గాడు.. లుచ్చా.. బ్రోకర్.. వాడి కుక్కలు.. వేస్ట్ గాళ్లు.. వెధవ..’ అబ్బో ఇంకా చాలా మాట్లాడాడు ఏపీ మంత్రి కొడాలి నాని.. కానీ వెబ్ సైట్ లో అన్ని బూతులు రాయలేం కదా.. సెన్సార్ చేసి కొన్నింటిని మాత్రమే మీకు రుచిచూపించాం.. ‘క్యాసినో’ వివాదంలో ఏపీ మంత్రి కొడాలి నాని బూతుల వర్షం కురిపించారు. అసలు వినడానికి కూడా వీల్లేని స్థాయిలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు.

    kodali nani

    ఏపీ మంత్రి కొడాలి నానికి చెందిన కళ్యాణ మండపంలో ‘క్యాసినో’(పేకాట) నిర్వహించారని టీడీపీ ఆరోపిస్తూ ఈరోజు వాటి పరిశీలనకు టీడీపీ నేతల ప్రతినిధి బృందం గుడివాడకు వచ్చింది. పోలీసులు అడ్డుకోవడం.. వైసీపీ శ్రేణులు కూడా పోటీగా రావడంతో గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

    ఈ క్రమంలోనే తన కళ్యాణ మండపంలో ‘క్యాసినో’ ఆడించానని టీడీపీచేస్తున్న రచ్చపై ఏపీ మంత్రి కొడాలి నాని రెచ్చిపోయారు. బూతులతో విరుచుకుపడ్డారు. ‘చంద్రబాబు గాడూ.. వాళ్లు కలిసి ఉద్దేశపూర్వకంగా ఏవో విజువల్స్ తీసుకొచ్చి.. అక్కడేదో జరిగిపోయిందని ఫోకస్ చేశారని.. తాను ఊళ్లో లేనప్పుడు ఆ కళ్యాణ మండపంలో చంద్రబాబుకు, ఆయనకు డబ్బా కొట్టే డబ్బా గాళ్లు పోయి లేనిది ఉన్నట్టు కళ్యాణ మండపంలో చూపించారని.. అక్కడ ఏం క్యాసినో జరగలేదని.. నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని చాలెంజ్ విసిరారు’ మంత్రి కొడాలి నాని..

    ఒకవేళ క్యాసినో తన కళ్యాణ మండపంలో ఆడలేదని నిరూపించకపోతే ఈ చంద్రబాబు గాడూ.. ఆడి గజ్జి కుక్కలు ఏం చేస్తారో చెప్పాలని కొడాలినాని సవాల్ చేశారు. చంద్రబాబు పిడిగ్రీ తినే కుక్కలు రికార్డింగ్ డ్యాన్సులని.. అవని.. ఇవనీ చూపిస్తారని.. పండక్కి అన్ని జరిగినట్టే అక్కడ జరిగాయని.. మహిళలతో డ్యాన్సులు చేయిస్తాన్నారంటే తానే స్వయంగా పోలీసులకు చెప్పి ఆపు చేయించానని కొడాలి నాని మీడియాకు వెల్లడించారు.

    చంద్రబాబు టైం అయిపోయిందని.. నిజనిర్ధారణ కమిటీ పెట్టి ఎప్పుడూ గెలవని వర్ల రామయ్య లాంటి వేస్ట్ గాడు..పకోడు గాడిని.. ప్రజల చేత తిరస్కరించి గెలవని చెత్త నా కొడుకులను పోగేసి ప్రశాంతంగా ఉన్న గుడివాడను చెడగొడుతున్నారని కొడాలి నాని నిప్పులు చెరిగారు.