Corona: మరో స్టార్ డైరెక్టర్ కి కరోనా.. ఇప్పుడు సినీ లోకమంతా కరోనా మయమే !

Corona: సినీ పరిశ్రమ మొత్తం కరోనా మయం అయిపోయేలా ఉంది. ఎక్కడ చూసినా కరోనా కలకలం కొన సాగుతూనే ఉంది. మూడో వేవ్ కేసులు ఇండస్ట్రీలో చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఈ సారి కరోనా కేసులు ఇంత వేగంగా వ్యాప్తి చెందుతాయని ఎవ్వరూ ఊహించలేదు. సడెన్ గా కరోనా ఇలా అటాక్ చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇక తాజాగా మరో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ కి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. తాజాగా టాలీవుడ్ […]

Written By: Raghava Rao Gara, Updated On : January 21, 2022 6:27 pm
Follow us on

Corona: సినీ పరిశ్రమ మొత్తం కరోనా మయం అయిపోయేలా ఉంది. ఎక్కడ చూసినా కరోనా కలకలం కొన సాగుతూనే ఉంది. మూడో వేవ్ కేసులు ఇండస్ట్రీలో చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఈ సారి కరోనా కేసులు ఇంత వేగంగా వ్యాప్తి చెందుతాయని ఎవ్వరూ ఊహించలేదు. సడెన్ గా కరోనా ఇలా అటాక్ చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇక తాజాగా మరో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ కి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.

Corona:

తాజాగా టాలీవుడ్ యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ కరోనా బారినపడ్డారు. కరోనా నిర్ధారణ టెస్టులో ఆయనకు పాజిటివ్ వచ్చింది. తనకు కరోనా వచ్చిందంటూ తరుణ్ భాస్కర్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ ఒక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఐసోలేషన్ లో విశ్రాంతి తీసుకుంటున్నానని, కరోనాను సీరియస్ గా తీసుకోండి ఫ్రెండ్స్’ అంటూ తరుణ్ భాస్కర్ తన పోస్టులో క్లారిటీ ఇచ్చాడు.

Also Read:ద్యావుడా.. కొడాలి నాని బూతు బాగోతం వింటే ఖతమే.. ‘క్యాసినో’ నిరూపిస్తే పెట్రోల్ పోసుకొని చస్తాడట.?

 

Corona:

టాలీవుడ్ లో డైరెక్టర్ గా అలాగే యాక్టర్ గా కూడా తరుణ్ భాస్కర్ ఇండస్ట్రీలోనూ తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అన్నట్టు తరుణ్ భాస్కర్ రెండు రోజులు కితమే విక్టరీ వెంకటేష్ ను కలిశాడు. కథ చెప్పడానికి అని. ఇప్పుడు వెంకీ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఏది ఏమైనా నటీనటులకు ఇలా వరుసగా కరోనా పాజిటివ్ వస్తుండటంతో సినిమా వాళ్ళు మళ్ళీ ఆందోళన బాట పట్టారు. అసలు షూటింగ్ స్పాట్స్ లో కరోనా వస్తే.. ఆ స్పాట్ లో ఉన్న వంద మందికి పైగా కరోనా సోకే అవకాశం ఉంటుంది.

Also Read: రవితేజ తల్లి పై కేసు.. కారణం అదే !

Tags