Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావడానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టారు. దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి బాటలో పయనిస్తున్నారు. ములుగు నియోజకవర్గం మేడారం నుంచి యాత్రకు శ్రీకారం చుట్టారు. యాత్రకు మంచి స్పందన వస్తుంది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు రేవంత్‌పై తిట్ల దండకం అందుకున్నారు. యాత్రలో, సభల్లో రేవంత్ చేస్తున్న విమర్శలకు ప్రతివిమర్శలు చేస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అయితే నేరుగా రేవంత్‌నే టార్గెట్ చేశారు. ఆయన ఎక్కడ అడుగు పెడితే ఆ పార్టీ ఖతం అని, రేవంత్ కారణంగా కాంగ్రెస్ నాశనం అయ్యిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు ఈ అంశం తెలంగాణ పాలిటిక్స్‌లో చర్చనీయాంశమైంది.
Also Read: Modi’s Kashmir Mission : కశ్మీర్.. ఊపిరి పీల్చుకో.. అక్కడ మోడీ ఉన్నాడు..
ప్రగతి భవన్ పేల్చివేయాలన్నందుకు..
పాదయాత్రలో భాగంగా ములుగులో నిర్వహించిన బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రగతి భవన్ ను నక్సలైట్లు పేల్చేయాలని వ్యాఖ్యానించారు. ప్రజలకు అనుమతి లేని ప్రగతి భవన్ ఉంటే ఎంత.. లేకపోతే ఎంత అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్ స్పందించారు. ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఐరెన్ లెగ్గేనా?
మత్రి దయాకర్‌రావు ఆరోపించినట్లు రేవంత్‌ది ఐరన్ లెగ్గేనా అన్న చర్చ ఇప్పుడు మళ్లీ మొదలైంది. టీడీపీలో ఉన్న సమయంలో ఆ పార్టీ పూర్తిగా చతికిల పడింది. 2014 ఎన్నికల సమయంలో టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలంతా గులాబీ గూటికి చేరారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా నాటి టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రిపదవి చేపట్టారు. నాడు రేవంత్ టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సమయంలో పార్టీ ఖాళీ అయింది.
తాజాగా రేవంత్ కాంగ్రెస్‌లో ఉన్నారు. టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అదే హోదాలో యాత్ర చేస్తున్నారు. అయితే రేవంత్ కారణంగానే తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. సీనియర్లు ఆయనతో కలిసి పనిచేయడం లేదు. ఒకానొక దశలో అసలైన కాంగ్రెస్ వాదులుగా చెప్పుకుంటున్న పదిమంది పార్టీని వీడుతారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ అధిష్టానం జోక్యంతో ప్రస్తుతం వారు పార్టీలోనే ఉన్నప్పటికీ రేవంత్‌తో కలిసి పనిచేయడం లేదు. పార్టీ సమావేశాలకూ దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలో రేవంత్ సహచరుడిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read: CM Jagan: ఏపీలో గెలుపు కోసం జగన్ వేసిన ప్లాన్ ఇదీ